నమస్కారాలు-రకాలు | Types of Namaskar in Telugu

0
6539
Types of namaskaras
నమస్కారాలు-రకాలు | Types of Namaskar in Telugu

Types of Namaskar in Telugu

నమస్కారము చేయడం అనేది శిష్టాచారం. ఇది నాల్గు విధాలు.

  1. సాష్టాంగ నమస్కారం,
  2. దండ ప్రణామం,
  3. పంచాంగ నమస్కారం,
  4. అంజలి నమస్కారం.

4. అంజలి నమస్కారం

రెండుచేతులను కలిపి నమస్కారం అనుట అంజలి నమస్కారం.స్వాచార్యులకు , జియర్ స్వాములకు , దేవాలయంలోని అర్చామూర్తులకు మొదటి రెండు పద్ధతులలో నేదైనా ఒక దానిని పాటిస్తారు. చేతిపై చేతిని యుడ్డముగా నుంచి కుడిచేతిలో గురువుయొక్క కుడిపాదము , ఎడమ చేతిలో ఎడమ పాదమును సృశించి నమస్కరించుట మరియొక విధానం.

వృత్యస్తపాణినా కార్య ముపసంగ్రహణం గురోః |

సవ్యేన సవ్యః సృష్టవ్యో దక్షిణేన చ దక్షిణః |

విద్య చెప్పిన గురువులకు ఈ విధంగా చేస్తారు. సాష్టాంగ నమస్కారం చేయువారు గాని, దండ ప్రణామం చేయువారు గాని, మస్తిష్కం, సంపుటం, ప్రహ్వాంగం అను మూడు రీతుల అంజలి చేసి నమస్కరించాలి.

  • మస్తిష్కం అనగా భూమిమీద సాగిలపడి లేచి తనరెండు చేతులను తలమీద ఉంచి అంజలి చేయుట.
  • సంపుటం అనగా మస్తిష్కం చేసిన తరువాత రెండు చేతులను జోడించి హృదయాన్ని చేర్చుట.
  • ప్రహ్వాంగం అనగా సంపుటంచేసిన తరువాత తలను శరీరాన్ని కొంచెం వంచి నిలుచుట.

మసిష్క సంపుటి ప్రహ్వాంగములతో కూడిన నమస్కారమే సంపూర్ణ నమస్కారం. వయస్సులోను, జ్ఞానంలోను నున్న సమానులు పరస్పరము అంజలి నమస్కారం చేయుట కూడా సంస్కారమే.

Promoted Content

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here