
TTD Release Angapradakshinam Tickets of August 2023
2అంగప్రదక్షిణం ప్రక్రియ (Angapradakshinam Procedure)
ఆగస్టు నెలకు సంబంధించిన అంగప్రదక్షిణ టికెట్లను మే 23వ తేది ఉదయం 10 గం.కు విడుదల చేయనున్నారు. టీటీడీ అధికారిక వెబ్ సైట్ https://tirupatibalaji.ap.gov.in/ లేదా tt Devasthanams యాప్‌లో వీటిని బుక్ చేసుకోవచ్చు. ఈ టికెట్లు పొందిన భక్తులు అర్దరాత్రి 12 గంటలకు శ్రీవారి పుష్కరిణిలో 3 మునకలు వేసి అవే తడి బట్టలతో రాత్రి ఒంటి గంటకు వైకుంఠం మొదటి క్యూ కాంప్లెక్స్ స్పెషల్ ఎంట్రీ దర్శనం క్యూ ద్వారా గుడి లోపలికి వెళ్లాలి. స్త్రీ, పురుషులను వేర్వేరుగా వెయిటింగ్ హాల్లోకి పంపిస్తారు.
శ్రీవారికి సుప్రభాత సేవ మొదలైన తర్వాత భక్తులను అంగప్రదక్షిణకు అనుమతిస్తారు. తెల్లవారుజామున 2:45 గంకు మొదటగా మహిళలను తర్వాత పురుషులకు అనుమతినిస్తారు. సుప్రభాత సమయంలోనే స్త్రీలు అంగప్రదక్షిణ పూర్తి చేసుకోని వెండి వాకిలి వద్దకు వెళ్లాకనే పురుషులను అంగప్రదక్షిణకు అనుమతిని ఇస్తారు. స్వామి వారి బంగారు వాకిలి ముందు నుంచి మొదలు పెట్టాలి. సాష్టాంగ నమస్కారం చేసినట్లు పడుకుని శ్రీవారి ప్రాకారం చూట్టూ దోర్లుకుంటు ప్రదక్షిణ చేస్తూ శ్రీవారి హుండీ వరకు చేయాలి. ప్రదక్షిణలు చేసే భక్తులకు శ్రీవారి సేవకులు సాయం చేస్తారు. అంగప్రదక్షిణం తర్వాత భక్తులకు శ్రీవారి దర్శనం, ఒక ఉచిత లడ్డూ ప్రసాదం అందిస్తారు. అంగప్రదక్షిణం నియమాల కోసం తరువాతి పేజీలో చూడండి.