
Tirupati Gangamma Jatara 2023
6సోదరికి వెంకటేశ్వరుడి సారె
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారు సోదరి గంగమ్మకు పుట్టింటి సారె పంపే ఆచారం గత 400 ఏళ్ల నుంచీ కొనసాగుతోంది.
తిరుపతి గంగమ్మ జాతర ఘట్టాలు (Events of Tirupati Gangamma Fair):
1. తమిళ సంప్రదాయం ప్రకారం ప్రతి సంవత్సరం చిత్రి నెల చివరి మంగళవారం అంటే మే మెదటి లేక రెండవ వారంలో చాటింపు జరుగుతుంది.
2. ఉదయం గుడి ఆవరణలో అమ్మవారి విశ్వరూప స్థూపానికి అభిషేకం చేసి, వడిబాల కడతారు.
3. సాయంత్రం గంగమ్మ జన్మ స్థలం అయిన అవిలాల గ్రామం నుంచి కైకాల కుల పెద్దలు పసుపు, కుంకుమ, నూతన వస్త్రాలు మరియు సారెను తీసుకువస్తారు.
4. ఈ పసుపు కుంకుమలను అర్ధరాత్రి 12 గంటలకు పొలిమేరల్లో చల్లుతూ, జాతర పూర్తి అయ్యే వరకు ఊరి ప్రజలు పొలిమేరలు దాటకూడదని చాటింపు వేస్తారు.







