
Tirupati Gangamma Jatara 2023
4తిరుపతి గంగమ్మ చరిత్ర (History of Tirupati Gangamma):
ఈ జాతర గురుంచి ఒక కథ ప్రాచూర్యంలో ఉంది. తిరుపతిని పాలెగాళ్ల రాజు పరిపాలించే కాలంలో, ఒక పాలెగాడు తన ప్రంతంలోని అందమైన అమ్మయిలను కనపదితే చాలు అత్యాచారం చేసేవాడు. అలాగే కొత్తగా పెళ్ళైన వధువులంతా మొదటి రాత్రి తనతోనే చేసుకోవాలి అని ఆంక్షలు విధించాడు. ఆ పాలెగాడిని చంపేసి ఆ ప్రంత మహిళలను కాపాడేందుకు గంగమ్మ తల్లే తిరుపతికి 2 కి.మీ దూరంలోని అవిలాల గ్రామంలో కైకాల కులంలో జన్మించిందని భక్తుల విశ్వాసం.
యవ్వనంలోకి వచ్చిన గంగమ్మని చూసిన పాలెగాడు తనపై కూడ కన్నేసాడు. ఆమెపై అత్యాచారానికి ప్రయత్నించడంతో గంగమ్మ తల్లి విశ్వరూపం చూపించింది. ఆమె తనను అంతం చేయడానికి అవతరించిన శక్తి అని తెలుసుకున్న పాలెగాడు ఎక్కడికో పారిపోయి దాక్కుంటాడు. తర్వాత గంగమ్మ పాలెగాడిని వెతుకుంటు రకరకాల మారు వేషాలలో 3 రోజుల వెతుకుతుంది. మొదటి రోజు బైరాగి వేషం, రెండో రోజు బండ వేషం, మూడో రోజు తోటి వేషాలలో తిరుగుతుంది.
మూడు వేషాలు వేసినా పాలెగాడు కనిపించకపోవడంతో, నాలుగోరోజు గంగమ్మ దొర వేషం వేసుకుంటుంది. దొర వచ్చాడనుకున్న పాలెగాడు బయటకు వచ్చాడు. వెంటనే అతడిని అక్కడే చంపి గంగమ్మ దుష్ట శిక్షణ షిష్ట రక్షన చేసింది. గంగమ్మ ఆ రోజు చేసిన పనికి గుర్తుగా ఈ రోజు వరకూ తిరుపతి, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఈ జాతర చేసుకుంటున్నారు. గంగమ్మ తమను కూడ రక్షించాలి అని మొక్కులు చెల్లించుకుంటారు.