వేసవిలో తిరుపతికి వెళ్ళ్దాం అనుకుంటున్నారా? ఈ టూర్ ప్యాకేజీ బుక్ చేస్తే శ్రీవారి ప్రత్యేక దర్శనం ఉచితం..

0
1856
IRCTC Tirupati Summer Tour Package Govindam
IRCTC Tirupati Summer Tour Package Govindam

IRCTC Tirupati Summer Tour Package Govindam

2ఈ టూర్ ప్యాకేజీ ప్రత్యేకత (Specialty of Tirumala Tour Package)

ఈ టూర్ ప్యాకేజీని బుక్ చేసుకున్న వారికి ఈ క్రింది సౌకర్యాలు లభిస్తాయి,

1. తిరుమలలో శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం (Tirumala Special Entry Darshnam) ఉచితంగా లభిస్తుంది.
2. తిరుచానూర్‌లో పద్మావతి అమ్మవారి దర్శనం కూడా ఉచితంగా లభిస్తుంది.

ఈ టూర్ ప్యాకేజీ పూర్తి వివరాలు (Full Details of Tirumala IRTCT Tour Package)

1. ఐఆర్‌సీటీసీ తిరుపతి టూర్ మొదటి రోజు హైదరాబాద్‌లో ప్రారంభం అవుతుంది.
2. ఈ ఎక్స్‌ప్రెస్ రైలు హైదరాబాద్‌లోని లింగంపల్లిలో సాయంత్రం 5.25 గంటలకు బయల్దేరుతుంది.
3. ఈ రైలు 6.10 గంటలకు సికింద్రాబాద్‌కి చేరుకుంటుంది.
4. రాత్రి 7.38 గంటలకు నల్గొండకి చేరుకుంటుంది.
5. రెండో రోజు ఉదయం తిరుపతికి చేరుకుంటారు.
6. వారు ఇచ్చిన హోటల్‌లో కాలకృత్యాలు తీర్చుకోని, స్నానాలు చేసిన తర్వాత ఉదయం 9 గంటలకు తిరుమలలో శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనానికి బస్ లో బయలుదేరాలి.
7. స్పెషల్ ఎంట్రీ దర్శన్ ద్వారా శ్రీవారిని దర్శించుకున్న తర్వాత మధ్యాహ్న భోజనం చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత తిరుచానూర్ బయల్దేరాలి.
8. తిరుచానూర్‌లో పద్మావతి అమ్మవారిని దర్శనం అయిన తర్వాత పర్యాటకుల్ని సాయంత్రం తిరుపతి రైల్వే స్టేషన్ దగ్గర దింపుతారు.
9. సాయంత్రం 6.25 గంటలకు రైలు తిరిగు ప్రయాణం మొదలు అవుతుంది.
10. మూడో రోజు తెల్లవారుజామున 3.04 గంటలకు నల్గొండలో, 5.35 గంటలకు సికింద్రాబాద్‌లో, 6.55 గంటలకు లింగంపల్లిలో రైలు దిగడంతో టూర్ ముగుస్తుంది.