
Next బటన్ నొక్కకుండా మొత్తం కంటెంట్ సింగల్ పేజీ లో మరింత సులువుగా చదవటానికి మన హరి ఓం యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి Android / iOS
అతిథులు ఇంటికి వస్తే ఎప్పుడు వెళతారా అని ఎదురు చూసే రోజులివి. కానీ ఒకానొక కాలం లో అతిథి సేవ చేసే భాగ్యం కలగడం గొప్ప అదృష్టంగా భావించే వారు. అతిథి దేవో భవ అన్న మాటను త్రికరణ శుద్ధిగా నమ్మేవారు. అటువంటి ఆదర్శవంతమైన కథ ఒకటి తెలుసుకుందాం.
4. చ్యవనుడి వరం
తరువాతి రోజు రాజదంపతులు గంగా తీరానికి వచ్చారు. వారి మాసిన బట్టలను గాయపడ్డ శరీరాలను చూసి చ్యవనుడు వారిని తిరిగి రాజసంగా ఆరోగ్యంగా చేస్తాడు. దాన మిచ్చినట్లు భ్రమింపజేసిన వారి సిరి సంపదలను రాజ భవనాన్ని తిరిగి ప్రసాదిస్తాడు. రాజ దంపతుల అతిథి భక్తికి, సహనానికి సేవకు సంతోషించిన చ్యవనుడు ‘ రాజా నీవు మహానుభావుడవు. నీ భార్య ఉత్తమ ఇల్లాలు. మీరిరువురూ సత్సంతానాన్ని కలిగి ఆనందంగా జీవిస్తారు. నీ వంశం లో విశ్వామిత్రుడనే బ్రహ్మర్షి జన్మిస్తాడు. అతడు నీ నామ ధేయం తో కౌశికుని గా ప్రసిద్ధిచెందుతాడు. నీ కీర్తిని ఆచంద్ర తారార్కం ప్రకాశింపజేస్తాడు. అని వరమిచ్చాడు.