
Next బటన్ నొక్కకుండా మొత్తం కంటెంట్ సింగల్ పేజీ లో మరింత సులువుగా చదవటానికి మన హరి ఓం యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి Android / iOS
అతిథులు ఇంటికి వస్తే ఎప్పుడు వెళతారా అని ఎదురు చూసే రోజులివి. కానీ ఒకానొక కాలం లో అతిథి సేవ చేసే భాగ్యం కలగడం గొప్ప అదృష్టంగా భావించే వారు. అతిథి దేవో భవ అన్న మాటను త్రికరణ శుద్ధిగా నమ్మేవారు. అటువంటి ఆదర్శవంతమైన కథ ఒకటి తెలుసుకుందాం.
2. చ్యవనుడి పరీక్ష
ఒకనాడు చ్యవనుడు రాజ దంపతులను పిలిచి రాజా నేను నిద్రకు ఉపక్రమిస్తున్నాను. నన్ను నిద్రలేపకుండా నా పాదసేవను చేయండి. నా పాద సేవ వదిలి మీరు నిద్రాహారాలకు కూడా పోరాదు. అని ఆదేశించాడు. ఆ రాజ దంపతులు అమితమైన భక్తితో చ్యవనుని పాద సేవ చేయ సాగారు. గంటలు గడిచినాయి. కానీ చ్యవనుడు నిద్ర మేల్కొన లేదు. రాజ దంపతులు ఆ యన పాద సేవ మాన లేదు. ఏకంగా 21 రోజులు గడిచినాయి. చ్యవనుడు నిద్రలేచి తన యోగమాయతో రాజ దంపతులను భయభ్రాంతులను చేసి అంతః పురం వదిలి బైటికి నడిచాడు. వారు ఆయన వెంటే వెళ్లారు. మళ్ళీ ఆయన నిద్రకు ఉపక్రమించాడు. మళ్ళీ 21 రోజులు గడిచాయి. మరునాడు లేచి ‘రాజా నేను నీ రథమెక్కి యాచకులకు దానాలు చేయాలి . నీవు నీ భార్యా గుర్రాలకు బదులుగా రథాన్ని లాగండి’ అన్నాడు. మహారాజు ముందువైపున ఆయన పట్టపురాణి రతానికి వెనకవైపున ఉండి రథాన్ని లాగారు. చ్యవనుడు రాజు ధనాన్ని యాచకులకు దానాలు ఇచ్చాడు. రాజ భవనం, భాండాగారం అన్నీ పంచేశాడు. గుర్రాలకు బదులుగా రథం లాగుతున్న రాజ దంపతులను నెత్తురోడేలా మునికోలతో కొట్టాడు.