పట్టణ సంస్కృతిలో పడి పశువుల పట్ల ప్రేమను, వాటితో ఉండే అనుబంధం చాలామంది చవిచూడరు. కుక్కలు, పిల్లులు వంటి జంతువుల పెంపకం కొంతవరకు మనుషులకి జంతువుల ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది. కానీ ఆవులు, ఎడ్లు, మేకలు వంటి జంతువుల పోషణ,పెంపకం ఉన్న పల్లెటూళ్లలో వారు పాడిని, పశువులను ఇంట్లో సభ్యులుగా, దేవతలుగా భావిస్తారు. అలా తన ఎడ్లను కన్నకొడుకుల్లా భావించిన ఒక రైతుకథ తెలుసుకుందాం.
4. రామయ్య దొంగలకు పారిపోయే ఉపాయం ఎందుకు చెప్పాడు?
తన ఎడ్లను కేవలం పొలం దున్నే పశువుల్లా కాకుండా తనతో సమానంగా,ఇంకా మిన్నగా చూసుకునే వాడు రామయ్య. ఆ ఎడ్లగురించి ఎవరైనా గొప్పగా మాట్లాడితే పుత్రోత్సాహంతో పొంగిపోయేవాడు. మరి అటువంటప్పుడు మేలుజాతి గుర్రాలకన్నా వేగంగా పరిగెత్తగల తన ఎడ్లు రక్షక భటుల గుర్రాల ముందు ఓడిపోతే సహించ గలడా? లేదు. అందుకే వాటిని గెలిపించాడు. అవి ఓడిపోయి తనకు దొరికేకన్నా, రక్షక భటుల గుర్రాలనే ఓడించాయన్న గెలుపు ముఖ్యమనిపించింది రామయ్యకు. అవి కూడా మనలాగే స్వేచ్ఛగా బ్రతికే హక్కును కలిగి ఉన్నాయి. వాటిని పట్టుకొచ్చి మళ్ళీ ఊడిగం చేయించడం నాకు ఇష్టం లేదు. నేను వాటిని సరిగా చూసుకున్నానని అవి అనుకుంటే తిరిగి తప్పక వస్తాయి. ఎందుకంటే వాటిని అదిలించి అదుపు చేయడం అసాధ్యం. వాటి శక్తి అంతటిది.” అన్నాడు. ఈ కారణం విన్న రక్షక భటులు పశువుల పై ఇంత గౌరవం, మమకారం గల అతనికి నమస్కరించి వెళ్ళిపోయారు.