పట్టణ సంస్కృతిలో పడి పశువుల పట్ల ప్రేమను, వాటితో ఉండే అనుబంధం చాలామంది చవిచూడరు. కుక్కలు, పిల్లులు వంటి జంతువుల పెంపకం కొంతవరకు మనుషులకి జంతువుల ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది. కానీ ఆవులు, ఎడ్లు, మేకలు వంటి జంతువుల పోషణ,పెంపకం ఉన్న పల్లెటూళ్లలో వారు పాడిని, పశువులను ఇంట్లో సభ్యులుగా, దేవతలుగా భావిస్తారు. అలా తన ఎడ్లను కన్నకొడుకుల్లా భావించిన ఒక రైతుకథ తెలుసుకుందాం.
2. హఠాత్తుగా ఒకనాడు
హఠాత్తుగా ఒకరోజు రామయ్య ఎడ్లు కనిపించకుండా పోయాయి. రామయ్య పుత్రశోకం తో బాధపడేవాడిలా రోదించసాగాడు. ఆ దొంగలు తన ధనాన్ని తీసుకు వెళ్ళినా బాగుండు. కొడుకుల్లా చూసుకుంటున్న తన ఎడ్లను తీసుకుని వెళ్లారే అని విలపించాడు. వెంటనే రక్షకభటులకు మొరపెట్టుకున్నాడు. వారు రామయ్య బాధకు చలించి వెంటనే ఎడ్లను వెతకనారంభించారు. వారితో పాటు రామయ్యకూడా ఎడ్లను వెతకడానికి వెళ్ళాడు.
Promoted Content