
What are the Benefits of Worshipping Anjaneya Swamy With Betel Leaves
2హనుమంతుడికి తమలపాకులంటే ఇష్ఠం వెనక ఉన్న పూరాణ గాధ (The Purana Story Behind Hanuman’s Love of Betel Leaves?)
మన పురాణాల ప్రకారం, ఒకరోజు సీతాదేవి అమ్మవారు ఆ శ్రీరామునికి తమలపాకు చిలుకల్ని అందిస్తూ రాములవారిని సేవిస్తూ ఉంటారు. ఆ శ్రీరాముని దగ్గరకు వచ్చిన ఆంజనేయుడు స్వామి మీ నోరు అంత ఎర్రగా ఎందుకయ్యింది అని ఆ రాముల వారిని అడిగాడట. అప్పుడు ఆ శ్రీ రాముడు తమలపాకులు తింటే నోరు ఎర్రగా అవుతుందని అంటారు. ఈ ఆకు తినడం వలన ఆరోగ్యానికి చాలా మంచిదని చెప్పతాడు. అప్పుడు ఆంజనేయస్వామి ఒళ్లంతా తమలపాకులు కట్టుకుని ఆనందంగా శ్రీ రాముని దగ్గరకు వచ్చాడట.
మరో పురాణ కథ ప్రకారం, అశోకవనంలో ఉన్న సీతాదేవి అమ్మవారికి, ఆంజనేయస్వామి ఆ శ్రీ రాముల వారి సందేశం చెప్పినప్పుడు సీతాదేవి అమ్మవారు సంతోషంగా ఆంజనేయస్వామికి తమలపాకుల దండ వేశారట. అప్పుడు ఆంజనేయస్వామి చాలా సంతోషపడ్డారని ప్రతీతి. అందుకే ఆంజనేయస్వామి స్వామికి తమలపాకుల దండ అంటే చాలా ఇష్టమని అందుకే భక్తులు కూడా సమర్పిస్తారు.
తమలపాకులు ధనలక్ష్మి దేవికి చాలా ఇష్టమైనవి. పూజలో తమలపాకులకు ప్రత్యేకమైన స్థానం కలిగి ఉంటుంది. తమలపాకులు దేవునికి సమర్పిస్తే మంచి మంచి ఫలితాలు జరుగుతాయని మన పండితులు చెబుతున్నారు. తమలపాకులను మంగళవారం రోజున ఆంజనేయ స్వామికి సమర్పిస్తే భక్తులు కోరుకున్న విజయాలు సాధిస్తారని చెబుతున్నారు. కొంతమంది శనివారం రోజున కూడా పూజ చేస్తారు. మంగళవారం లేదా శనివారం నాడు ఆంజనేయుడికి తమలపాకులతో పూజ చేయడం వల్ల విశిష్ఠమైన ఫలితాలతో పాటు అనారోగ్యం నుండి భయటపడటం మరియు కష్టాలు తొలగిపోతాయని పురోహితులు చెబుతున్నారు. మరిన్ని వివరాల కోసం తరువాతి పేజీలో చూడండి.