Shiva Puranam | శివ మహాపురాణం లోని అద్భుత విశేషాలు

0
105
why to read shiva puranam
shiva puranam

The great Shiva Maha Puranam

శివ మహా పురాణం: వేద తుల్య పుణ్య గ్రంథం

శివ మహా పురాణం వేదాలకు తుల్యమైన మహా పుణ్యప్రద గ్రంథం. ఇది పరమేశ్వరుని కృపతో నిర్మితమైంధి. ఈ పురాణంలో పన్నెండు సంహితలు ఉన్నాయి: విద్యేశ్వర, రుద్ర, వినాయక, ఉమ, మాతృ, ఏకాదశ రుద్ర, కైలాస, శతరుద్ర, కోటి రుద్ర, సహస్ర కోటి రుద్ర, వాయు, ధర్మ సంహితలు. ప్రతీ సంహితలో ఉన్న శ్లోకాలు అనేకమున్నాయి, మొత్తం లక్ష శ్లోకాలను కలిగి ఉంది.

పురాణ గాథలు
వ్యాస మహర్షి, కలియుగంలో పుట్టబోయే మనుష్యుల కష్టాలను ఎరిగి, ఈ పురాణాన్ని సంక్షిప్తం చేశారు. దీనిని తొలుత పరమేశ్వరుడు సృష్ట్యాది యందు నిర్మించాడు. కాలగమనంలో, మహర్షులు ఈ పురాణాన్ని సంక్షిప్తం చేశారు, పద్దెనిమిది పురాణాలుగా విభాగించారు.

శివ మహా పురాణం సంహితలు

ఈ పురాణంలో ఉన్న ముఖ్య సంహితలు:

  1. విద్యేశ్వర సంహిత
  2. రుద్ర సంహిత
  3. శతరుద్ర సంహిత
  4. కోటిరుద్ర సంహిత
  5. ఉమా సంహిత
  6. కైలాస సంహిత
  7. వాయు సంహిత
  8. వేద తుల్య పురాణం

శివ మహా పురాణం వేదాలకు సమానమైనది. ఇది శ్రేష్ఠతమం, మోక్షదాయకం, చతుర్విధ పురుషార్థ సాధకం. ఈ గ్రంథం జీవన్ముక్తికి మార్గం చూపిస్తుంది, ఆధి దైవిక, ఆధి భౌతిక, ఆధ్యాత్మిక దుఃఖాలను నివారిస్తుంది. సకల కల్మషాలను తొలగిస్తుంది, దురితక్షయ నివారిస్తుంది. మంగళప్రదాయకం, అద్వైతానంద ఆత్మ సాక్షాత్కారాన్ని ప్రసాదిస్తుంది.

శివ పురాణ పఠనం మహిమ:

శివ పురాణం వ్యాప్తిలోకి రాక ముందు పాపాలు ప్రబలుతాయి, ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తాయి. శివపురాణం పఠనం తర్వాత, అవిద్య, అజ్ఞానం నశించి, కల్మషాలు తొలగిపోతాయి. శివ మహాపురాణ శ్రవణం వల్ల, మరణభయం తొలగిపోతుంది, మోక్ష పథం సులభం అవుతుంది. శివ-శక్తుల అనంతత్త్వాన్ని మనసులో భావించినా, పునర్జన్మ లేదు, ఆ జీవుడు సాక్షాత్తు శివుడవుతాడు.

శివ మహా పురాణం యొక్క ఫలాలు

వేద, శాస్త్రాల అధ్యయనం చేసి పొందే మహాపుణ్యాన్ని, ఈ పురాణ పఠనం మరియు శ్రవణం చేస్తే పొందవచ్చు. శివ మహా పురాణంలో ఉన్న ఒక్క శ్లోకాన్ని పఠించినా లేదా భక్తితో నమస్కరించినా, సర్వ దేవతా పూజా ఫలం లభిస్తుంది. ఈ పురాణాన్ని గృహంలో భద్రంగా ఉంచితే కూడా పుణ్యం లభిస్తుంది.
ఎవరైతే చతుర్దశి నాడు ఉపవాసం ఉండి, శివ భక్తుల సమక్షంలో ప్రవచనం చేస్తారో, వారు గాయత్రీ మంత్ర పురశ్చరణ ఫలం పొందుతారు. రాత్రి జాగరణ చేసి శివ పురాణం పఠిస్తే, వారికి అమాంతం పుణ్యం లభిస్తుంది. కురుక్షేత్రం, గయ, ప్రయాగ వంటి పుణ్య క్షేత్రాల్లో హిరణ్యదానం చేస్తే వచ్చే పుణ్యఫలం కంటే కూడా ఎక్కువ పుణ్యం శివ పురాణం పఠనంతో లభిస్తుంది.

Related Posts

Lord shiva | శివుడి శిరస్సుపై చంద్రుడు ఎందుకున్నారో తెలుసా?

Significance of worshipping Lord Shiva via Nandi | నంది కొమ్ముల మధ్యలో నుండి శివుడిని చూడటం వెనుక కారణం.

Arunachalam Karthika Deepam | అర్ధనారీశ్వరుడి కథలో తిరువణ్ణామలై కార్తీక దీపోత్సవ ప్రత్యేకత

తిరువణ్ణామలైకి ఎలా చేరుకోవాలి? చూడవలసిన ప్రదేశాలు?! | How to Reach Tiruvannamalai? Places to Visit in Arunachalam?!