
Do Not Make These Mistakes While Worshiping Lord Shani
1శని దేవుడి పూజ చేసేటప్పుడు ఈ తప్పులు చేయకండి
హిందువులు చాలా మంది ఏళ్ళనాటి శని, అర్దాష్టమ శని ప్రభావంతో బాధపడుతుంటారు. శని దేవుడి ప్రభావం నుంచి ఊరటపొందడానికి శనీశ్వర ఆలయాలకు వెళ్తుంటారు. పురాణాల ప్రకారం శనిదేవుడిని కర్మ దేవుడిగా పూజిస్తారు. శనీశ్వరుడు తలుచుకుంటూ ఓడలు బళ్లు అవుతాయి, బళ్లు ఓడలు అవుతాయని భక్తుల నమ్మకం. మనం కర్మలను బట్టి ఆయన తగిన ఫలితాలు ఇస్తుంటారు. ఇందులో భాగంగానే కొందరు తమ జాతకంలో అనేక చెడు ప్రభావం కల్గి ఉంటారు.
దీని నుంచి ఉపశమనం పొందడానికి పూజారులు, పండితులను సంప్రదించి తమ భాధలు పోవడానికి వారు చేప్పే పరిహారాలను చేస్తుంటారు. కొందరు శనివారాల వ్రతం చేస్తుంటారు. మరికొందరు శనికి తైలాభిషేకం, నలుపురంగు బట్ట, నల్లని పదార్థాలను అర్పిస్తుంటారు. డబ్బులు ఉన్నవారు వస్త్రాలు, అన్నదానం, పురోహితులకు నవధాన్యాల దానంగా ఇచ్చి, తమ కష్టాలను, బాధలను తొలగించమని శనిదేవుడిని వేడుకుంటుంటారు. ఇలాంటి పరిహారాలు పాటించడం వలన శనిదేవుడు కొంత శాంతించి చెడు ప్రభావం నుంచి బయట పడేస్తాడుని భక్తులు విశ్వాసం.
శని దేవుడిని పూజించేటప్పుడు ఈ నివారణలు పాటించాలి (Need to Follow Remedies While Worshipping Lord Shani)
శని దేవుడి యొక్క అశుభ ప్రభావం ఉన్న వారు శని దేవుడి అనుగ్రహాన్ని పొందాలనుకుంటే ఈ క్రింది పరిహారాలు చేయండి,
1. శనివారం పూజ చేయండి.
2. శనివారం సూర్యోదయం తర్వాత రావి చెట్టును పూజించాలి. శనిదేవుడు రావి చెట్టు కింద నివసిస్తాడు అని నమ్ముతారు.
3. నీళ్లతో పాటు నూనె దీపం వెలిగించండం వల్ల శని దేవుడి అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది.
4. శనివారం ఉదయాన్నే స్నానం చేసి శుభ్రమైన నల్లని బట్టలు ధరింంచి రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం గుడికి వెళ్లి శని దేవుడిని పూజించండి. ఈ పనుల వల్ల శనిదేవుని అనుగ్రహం పెరిగి జాతకంపై పడే సతి ప్రభావం తగ్గుతుంది.
5. ప్రతి శనివారం సుందరకాండ లేదా హనుమాన్ చాలీసాను పఠించాలి.
6. ముఖ్యంగా శనిదేవుని కళ్లలోకి చూడకుండా కళ్ళు క్రిందికి ఉంచి శని దేవుడిని ఆరాదించండి.
7. శెనగలు, బెల్లం, నువ్వులు ప్రత్యేకంగా నైవేద్యంగా పెట్టండి.
8. గోరులాంటి ఇనుప వస్తువు సమర్పించండి. దీంతో శని దేవుడి సంతోషిస్తాడు.
Related Posts
https://hariome.com/shani-disaster-sign-better-careful/
ఈ పనితో శివకేశవుల అనుగ్రహం మీ సొంతం, 3 దోషాల నుంచి కూడ విముక్తి!
ధనవంతులను చేసే పుట్టుమచ్చలు ఎక్కడ ఉంటాయో తెలుసా? | Moles & Their Significance
చెవిలో వెంట్రుకలు ఉంటే అదృష్టమా? దురదృష్టమా? | Astrology Vs Science | Hairs In Ear
తలలో రెండు సుడులు ఉండటానికి గల శాస్త్రీయ కారణం! | Whorls In Head
శ్రీవారి భక్తులకు శుభవార్త! రేపు తిరుమలలో పౌర్ణమి సందర్భంగా ఆ పవిత్ర సేవ
తిరుమల శ్రీవారి భక్తులకు మరో కన్నుల పండుగ | Upcoming Celebration in Tirumala
సింహాచలం అప్పన్న చందనోత్సవంలో వీటి వల్ల ఇబ్బందులు పడిన భక్తులు
టీటీడీ పేరుతో మరో నకిలీ వెబ్సైట్, ఇదే అధికారిక వెబ్సైట్ | TTD Official Website vs Fake Websites
శ్రీవారి భక్తులకు తిరుమల కొండపై మరో ఉచితం | TTD Another Free Seva to Devotees
2023లో గంగా పుష్కరాలు పూర్తి వివరాలు | Ganga Pushkaralu 2023 | పుష్కరాలలో చెయ్యవలసిన విధులు
తిరుమలకు వెళ్ళే దారులు? గతంలో ఏడుకొండలు ఎలా ఎక్కేవారు..? | Tirumala Routes
కాశీ ప్రసాదం మరియు పేరులో మార్పు! | Kashi Prasadam and Change in Name of Prasad!