Shani Jayanti 2025 | శని జయంతి, పూజా విధానం, ప్రాముఖ్యత మరియు కథ ఈ రోజున ఏమి చేయాలి.

0
7281
Special Remedies to Get Rid of Shani Dosha on Shani Jayanti
Remedies to Get Rid of Shani Dosha on Shani Jayanti

Special Remedies to Get Relief From Shani Dosha on Shani Jayanti

1శని జయంతి నాడు శని దోషం నుండి ఉపశమనం పొందడానికి ప్రత్యేక పరిహారాలు.

శని జయంతిని జ్యేష్ఠ మాసంలో అమావాస్య రోజున జరుపుకుంటారు. శని జయంతి రోజున శని దేవుడికి ప్రత్యేక పూజలు చేస్తారు. దీని వలన బాధలన్నీ తొలగిపోతాయి అని భక్తుల నమ్మకం.శని జయంతి శని భగవానుడి జన్మదినోత్సవం, ఇది హిందువులు ధార్మికంగా జరుపుకునే ఒక ముఖ్యమైన పండుగ. ఈ సంవత్సరం, శని జయంతి మే 27 జరుపుకుంటారు.

శని జయంతి 2025 తేదీ & ముహూర్తం (Shani Jayanti 2025 Date & Muhurt)

మంగళవారం, మే 27, 2025న శని జయంతి

అమావాస్య తిథి ప్రారంభం – మే 26, 2025న 12:11
అమావాస్య తిథి ముగుస్తుంది – మే 27, 2025న 08:31

శని జయంతి పూజా విధానం:

  • ఇంట్లో లేదా శని దేవాలయంలో పూజ చేసుకోవచ్చు.
  • శని దేవుడి విగ్రహాన్ని స్నానం చేయించి, శుభ్రమైన వస్త్రాలు, నగలు, ఆభరణాలతో అలంకరించండి.
  • నల్ల నువ్వులు, ఆవనూనె దీపం వెలిగించండి.
  • “ఓం శం శనైశ్చరాయ నమః” అనే మంత్రాన్ని జపించండి.
  • శని దేవునికి నైవేద్యం సమర్పించండి.
  • “శని చాలీసా” లేదా “శని స్తోత్రం” పఠించండి.
  • దానాలు చేయండి, అవసరమైన వారికి సహాయం చేయండి.

శని జయంతి యొక్క ప్రాముఖ్యత:

  • శని జయంతి శని దేవుడిని ఆరాధించడానికి మరియు ఆయన కరుణను పొందడానికి ఒక ముఖ్యమైన అవకాశం.
  • ఈ రోజున పూజలు, ఉపవాసాలు పాటించడం వల్ల శని దేవుడి ప్రభావం తగ్గుతుందని నమ్ముతారు.
  • శని జయంతి ధర్మం, నీతి మార్గంలో నడవడం యొక్క ప్రాముఖ్యతను గుర్తు చేస్తుంది.

శని జయంతికి సంబంధించిన కథ:

హిందూ పురాణాల ప్రకారం, సూర్య భగవానుడి భార్య అయిన చాయాదేవి, సూర్యుడి నుండి వెలువడే తీవ్రమైన కాంతిని తట్టుకోలేకపోయింది. దాంతో ఆమె తన స్థానంలో నీడను (ఛాయ) వదిలి తపస్సు చేయడానికి వెళ్లిపోయింది. ఆ సమయంలో ఛాయాదేవికి శని దేవుడు జన్మించాడు. కానీ, శని నల్లటి రూపాన్ని చూసి సూర్యుడు అనుమానించి, ఛాయాదేవిని అవమానించాడు. తన తల్లిపై జరిగిన అవమానాన్ని తట్టుకోలేని శనిదేవుడు, సూర్యుడిపై కోపంతో చూశాడు. దాంతో సూర్యుడు నల్లగా మారిపోయాడు. ఈ పరిస్థితిని చూసి శివుడు జోక్యం చేసుకుని, ఛాయాదేవి పవిత్రతను తెలిపి, శని దేవుడిని న్యాయం, కర్మ ఫలితాలను ఇచ్చే దేవుడిగా ఆశీర్వదించాడు.

ఈ కథనం శని జయంతి రోజున మనల్ని ధర్మం పట్ల, న్యాయం పట్ల నిలకడగా ఉండేలా ఉపదేశిస్తుంది.

శనివారాల ప్రాముఖ్యత:

శనివారం రోజు శని దేవుడిని పూజించడానికి అంకితం చేయబడింది. ఈ రోజు నల్లని వస్త్రాలు ధరించి, శని దేవుడికి నూనె, నువ్వులు సమర్పించి, “ఓం శం శనైశ్చరాయ నమః” అనే మంత్రాన్ని జపించడం ద్వారా శని దేవుడి అనుగ్రహం పొందవచ్చు.

శని జయంతి మాత్రమే కాకుండా ప్రతి శనివారం శని దేవుడిని పూజించడం ద్వారా జీవితంలోని కష్టాలు తగ్గుతాయని, శని దేవుడి ప్రభావం తగ్గుతుందని నమ్మకం.

శని జయంతి రోజున ఏమి చేయాలి?

  • ఉదయం నిద్ర లేచి స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించుకోండి.
  • ఇంట్లో శని దేవుడి విగ్రహాన్ని ఉంచి, పూజా సామగ్రిని సిద్ధం చేసుకోండి.
  • శని దేవుడి విగ్రహానికి పసుపు, కుంకుమ రాసి, నల్లటి వస్త్రాలు ధరింపజేయండి.
  • నువ్వుల నూనె దీపం వెలిగించి, “ఓం శం శనైశ్చరాయ నమః” అనే మంత్రాన్ని జపించండి.
  • శని దేవుడికి నైవేద్యంగా నల్లని ఉడి, నువ్వుల లడ్డూ సమర్పించండి.
  • “శని చాలీసా” లేదా “శని స్తోత్రం” పఠించండి.
  • మీ స్తోమత ప్రకారం ధానాలు చేయండి, లేదా అవసరమైన వారికి సహాయం చేయండి.

శని జయంతి రోజున పైన చెప్పిన పద్ధతిలో పూజలు చేసి, ధర్మబద్ధమైన జీవితాన్ని గడపడం ద్వారా శని దేవుని అనుగ్రహం పొందుతారు.

Hariome” ను ఆదరిస్తున్న మిత్రులకు అభినందనలు. ఈ రోజు వరకు మన హరిఓం ద్వార మీకు మంచి సమచారాన్ని అందించడం జరిగింది. భవిష్యత్‌లో మీకు మరింత చేరువవ్వడం కోసం “Hariome” కొత్త ‘WhatsApp‘ ఛానెల్ ని ప్రారంభించడం జరిగింది. దేవాలయాల సమాచారం, పండుగల సమాచారం, ధర్మ సందేహాలు, ఆధ్యాత్మికం & పూజా విధానాలు వంటి సంచారం కోసం మా ఛానెల్ ని అనుసరించండి.

Follow Our WhatsApp Channel

Related Posts

https://hariome.com/shani-disaster-sign-better-careful/

Sun Transit Made Kendra Trikon Rajyoga

Mangal Shukra Yuti in Mithun Rashi 2023

https://hariome.com/sun-mercury-conjunction-in-aries-surya-budh-yuti/

శుక్ర మహాదశతో రాజులాంటి జీవితం, పటించాల్సిన పరిహారాలు | Shukra Mahadasha

సూర్య భగవానుడుని సూర్య గోచార్ వల్ల ఈ రాశుల వారికి 10 రెట్ల అదృష్టం, సూర్యునిలా ప్రకాశిస్తారు | Surya Gochar 2023

https://hariome.com/saturn-retrograde-2023-effect-luck-zodiac-signs/

12 ఏళ్ల తర్వాత చంద్రగ్రహణంలో చతుర్గ్రాహి యోగం, ఈ 4 రాశులకు అదృష్టం పట్టబోతుంది! | Chaturgrahi Yoga on Solar Eclipse 2023

జాతకంలో రాహువు-కేతువులు ఇబ్బంది పెడుతున్నారా? ఈ నివారణలతో విముక్తి పొందండి | Remedies For Rahu-Ketu Dosha

శుక్రుడి గోచారంతో వీరికి మిశ్రమ ఫలితాలు! Venus Transit 2023

మేషరాశిలో ఉదయించబోతున్న బుధ గ్రహం, ఈ రాశులు మకుటం లేని మహారాజులు | Budh Uday 2023

శని-సూర్య దోషం వల్ల ఇబ్బంది పడుతున్నారా? రవి యోగంలో ఈ పరిహారాలు చేయండి | Ravi Yoga 2023

శనిదేవుడి ఆశీర్వాదంతో పేద నుంచి రాజు, చేయవలసిన పరిహారాలు | How to Get Shani Dev Blessings

మే 10న మంగళ గోచరం యోగం, ఈ రాశులపై డబ్బుల వర్షం? | Mangal Gochar 2023