- పూజా ద్రవ్యాలు మనకు కుడిచేతి వైపున ఉండాలి.
- నేతిదీపం దేవునకు కుడివైపున ఉంచాలి. నూనె దీపమైతే దేవునకు ఎడమవైపున ఉండాలి.
- ఎడమచేతితో ఉద్ధరణె నీళ్ళు తీసుకుని కుడి చేతిలో పోసుకుంటూ ఆచమనం చేయాలి.
- ఆచమనం చేసేటప్పుడు చప్పుడు కారాదు. మిసాలకు, గడ్డానికి ఆ జలం తగులరాదు.
- గంటను పువ్వుతో అర్చించి తరువాత మ్రోగించాలి. అయితే గంటను, శంఖాన్ని, తమలపాకులను ఎట్టి పరిస్థితుల్లోనూ నేలపై ఉంచరాదు.
- పువ్వుల రెక్కలను విడదీసి పూజించరాదు.
- పూజులో వీలైనంతవరకు ఎడమచేతిని ఉపయోగించకపోవడం మంచిది.
- తూర్పు – ఉత్తర దిక్కులకు అభిముఖంగా ఉండి పూజించడం, అనుష్ఠానం చేయడం మంచిది.
- పూజలకు, జపానికి వినియోగించే ఆసనం – అనుష్ఠాన అనంతరం ఎవరికి వారే తీయాలి – ఒకరి ఆసనాన్ని ఇంకొకరు తీస్తే వారి జపఫలం వీరికి సంక్రమిస్తుంది. భర్త వాడిన ఆసనాన్ని భార్య తీయవచ్చు.
- జపం చేసేటప్పుడు మాలమధ్యలో ఆపకూడదు. మాట్లాడడం, సైగలు చేయడం కూడనివి.
- నూతన వస్త్రాలను ఎవరికైనా ఇచ్చేటప్పుడు ఆ వస్త్రాలకు నలువైపుల కొనలకు పసుపుపెట్టి ఇవ్వాలి.
- అన్న నివేదన చేసేటప్పుడు శుచిగా వండిన అన్నాన్నే నివేదించాలి. నేలపై నీటితో తుడిచి, ముగ్గుపెట్టి అన్న పాత్రను ఉంచాలి.
- వట్టి నేలపై కూర్చొని జపించరాదు, పూజించరాదు, భుజించరాదు.
- ”పూజ” అంటే ”భోగములను ప్రసాదించునది (కలిగించునది)” అని అర్ధం. పూజలో వాడే ఉపచారాలను గ్రహించి దేవతాశక్తులు మనకు ఆనంద భోగాలను అనుగ్రహిస్తారు.
- మనం పలికే స్తోత్రశబ్దాలు, దీప ధూపాలు, కుసుమాలు దేవతలకు ప్రీతికరాలు. శుచిప్రియులు దేవతలు. అందుకే శుచి, శుభ్రత పూజాజప ప్రాంతాలలో ఉండాలి.
- బహిష్టులు స్త్రీలు మసలేచోట వారి దృష్టి పడేచోట దేవతాపూజ, అనుష్ఠానం, దీపారాధన జరుగరాదు. మనకు తెలియని సూక్ష్మజగత్తులో, ఆ స్థితిలో చాలా దుష్ప్రకంపనలు జరుగుతాయి. ఈ నియమాలు వేదాలలో కూడా చెప్పబడ్డాయి.
Spiritual Posts
కొబ్బరికాయను నైవేద్యంగా పెట్టడం, దేవుడికి జంతుబలి ఇవ్వడం లాంటివేనా?