శ్రీ నూకాంబిక అమ్మవారి ఆలయ పునర్నిర్మాణం | Rebuilt Anakapalli Nookambika Temple

0
510
Anakapalli Nookambika Temple
Anakapalli Nookambika Temple

When is Rebuilt of Anakapalli Nukambika Temple?!

1శ్రీ నూకాంబిక అమ్మవారి ఆలయ పునర్నిర్మాణం

ఆంధ్ర ప్రదేశ్ లో ప్రముఖ దేవాలయాల్లో ఒకటైన అనకాపల్లి నూకాంబిక అమ్మ వారి ఆలయం. ఇప్పుడు ఈ ఆలయ పునర్నిర్మాణానికి అన్ని సిద్దమవుతున్నాయి. సుమారుగా 6.5 కోట్ల రూ.ల అంచనా వ్యయంతో 2 దశల్లో ఆలయ నిర్మాణం పూర్తి చేయాలని దేవదాయశాఖ అధికారులు నిర్ణయించారు. జూన్ 8వ తేదీన ఆలయ పునర్నిర్మాణ పనులకు భూమి పూజ చేయడానికి అధికారులు సిద్దమవుతున్నారు.

మొదటి దశలో 3 కోట్ల రూపాలయలతో అంతరాలయం, గర్భాలయం, అనివేటి మండపాలను పూర్తిగా రాతితో నిర్మిస్తారు. రెండో దశలో 3.5 కోట్ల రూపాలయలతో ఆలయ ప్రాకార మండపంతో పాటు ఇప్పుదు గుడికి తూర్పు దిశలో ఉన్న రాజగోపురం మాదిరిగా ఉత్తర, దక్షిణ, పడమర దిశల్లో మూడంతస్థులతో రాజగోపురాలను నిర్మిస్తారు. ఈ నిర్మాణ భాద్యతలను కాణిపాకం వినాయక ఆలయం, తలుపులమ్మలోవ, రామతీర్థాలు ఆలయాల పనులు చేసిన శ్రీధర్‌రెడ్డి అనే కాంట్రాక్టర్‌తో చేయబోతున్నారు.

ప్రస్తుతం 14.5 అడుగులు ఉన్న గర్భాలయాన్ని అదే స్థానంలో కొత్తగా నిర్మించనున్నారు. 5 అడుగుల వెడల్పు ఉన్న అంతరాలయాన్ని 12.5 అడుగులకు పెంచుతారు. 14 అడుగులు ఉన్న అనివేటి మండపాన్ని 35 అడుగులకు విస్తరిస్తారు. ప్రస్తుతం ఆలయ నిధులు సుమారు రూ.5.5 కోట్లు వేర్వేరు బ్యాంకుల్లో స్థిర డిపాజిట్ల రూపంలో ఉన్నాయి. ఇంక తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి ట్రస్టు నుంచి రూ.3 కోట్లు ఇవ్వనున్నట్లు తెలిపింది. వచ్చే సంవత్సరం మార్చి లేదా ఏప్రిల్ నెల ‌నాటికి (అంటే నూకాంబిక అమ్మవారి కొత్త అమావాస్య జాతర) వరకు ఆలయ పునర్నిర్మాణ పనులు పూర్తి అవుతాయన్న ఆశాభావాన్ని ఆలయ కమిటి వ్యక్తం చేసింది.

నూకాలమ్మ దేవాలయం అనకాపల్లి వేళలు (Nookalamma Temple Anakapalle Timings):

ఉదయం 6 – రాత్రి 7.30 వరకు

పూజలు మరియు సమయాలు (Anakapalle Nookalamma Temple Poojas and Timings)

  • ఆలయ ప్రారంభ సమయం, ఆరాధన – ఉదయం 5:30
  • బాలబ్జోగ నైవేద్యం – ఉదయం 6:00 నుండి 6.30 వరకు
  • నుండి దర్శనం – ఉదయం 6:30
  • రాజభోగం – ఉదయం 11:30 నుండి మధ్యాహ్నం 12:00 వరకు
  • భోగం – సాయంత్రం 4:00 నుండి 6:30 వరకు
  • వేదపారాయణం – సాయంత్రం 6:00 నుండి 6:30 వరకు
  • ఆలయ ముగింపు సమయం – 8:00 p.m.

సేవలు & ధరలు (Anakapalle Nookalamma Temple Seva Tickets Prices)

  • శీఘ్ర దర్శనం : రూ 25/
  • విశిష్ట దర్శనం (ప్రసాదం, పూజకుంకుమ ఇవ్వబడుతుంది) : రూ 50/-
  • కుంకుమ పూజ : రూ 25/-
  • ప్రత్యేక దర్శనం : రూ 50/-
  • శాశ్వత పూజ : రూ 1116/-
  • కేశఖండన (టాన్సర్) : రూ 10/-
  • రిటర్న్ చీర : రూ 5/-
  • స్కూటర్/సైకిల్ కోసం పూజ : రూ 25/-
  • కారు, జీపు, ఆటోలకు పూజ : రూ. 100/-
  • భారీ వాహనం కోసం పూజ : రూ 150/-
  • ఊంజల్ సేవ : రూ 216/-
  • సహస్ర దీపాలంకార సేవ : రూ 316/-
  • మహాలక్ష్మి ధన పూజ : రూ 20/-
  • సమీ పూజ : రూ 516/-
  • దసరా నవరాత్రుల కుంకుమ అర్చన (9 రోజులు పూజ నిర్వహించబడుతుంది & ప్రసాదం, బ్లౌజ్ పీస్ మొదలైనవి ఇవ్వబడతాయి) : రూ 516/-
  • దసరా కుంకుమ అర్చన (ఒక రోజు పూజ మరియు ప్రసాదం ఇవ్వబడుతుంది) : రూ 150/-

Related Posts

వారణాశిలో 12 రహస్య దేవాలయాలు | 12 Secret Temples of Varanasi

తిరుమలలో భద్రతపై టీటీడీ కీలక నిర్ణయాలు?! ఇక నుంచి భక్తులు ఖచ్చితంగా పాటించాల్సిందే! | TTD Updates

శని కష్టాలు పోయి అదృష్టం కలగాలంటే ఈ పదార్ధంతో పరిహారం ఇలా చేయండి! | Black Pepper Remedy For Shani

https://hariome.com/rohini-nakshatra-guru-pushya-nakshatra/

ఇలా చేస్తే 7 జన్మాల పాపాలు పోయి శాశ్వతమైన పుణ్యం లభిస్తుంది! | Hindu Beliefs

ఇంట్లో ఏ జంతువుల విగ్రహాలను పెట్టుకోవాలి? వాటి ఫలితాలు ఏమిటి? Which Animal Idols can we keep House?

ఈ చెట్టును పూజిస్తే సంతాన ప్రాప్తి మరియు స్వర్గానికి వెళ్తారు! | Gaya Banyan Tree Worship & Results

దేవుడికి ఏ పండ్లు నైవేద్యంగా పెడితే ఎలాంటి ఫలితం వస్తుంది? | Which Fruits are Offered to the God

నవగ్రహాలకు అస్సలు ఇష్టం లేని & చేయకుడని పనులు | The Things That Navagrahas Do Not Like

కాల సర్ప దోషానికి అద్భుతమైన పరిహారం | Kaal Sarp Dosh Remedies

తులసికి నీరు సమర్పించడానికి సరైన సమయం ఏమిటి? | Right Time to Offer Water to Tulsi

బ్రహ్మ ముహూర్తంలో పుట్టిన వారి వ్యక్తిత్వ రహస్యం తెలుసుకోండి | If Born in Brahma Muhurta

మీ చేతి గోళ్లు ఇలా ఉన్నాయా? అయితే మీరు చాలా అదృష్టవంతులు | Nails Astrology

ఈ మంత్రాన్ని జపిస్తే వేల అశ్వమేధ యాగాలకు సమానమైన ఫలితం | Gayatri Mantra Significance Benefits