
2. మంగళ సూత్రాలలో పగడం,ముత్యం తప్పనిసరిగా ఎందుకు ధరిస్తారు?
మంగళ సూత్రాలు స్త్రీ పసుపు కుంకుమలతో పాటుగా ఆమె ఆరోగ్యాన్ని కూడా పరిరక్షిస్తాయి. పగడం సూర్యునికి మరియు కుజునికి , ముత్యం చంద్రుని కి ప్రతీకలు. ఆ రెండూ సూర్య, చంద్ర తేజాలను తమలో నిక్షిప్తం చేసుకుని ఉంటాయి. స్త్రీ శరీరానికి కావలసిన ఉత్తేజాన్ని పగడం అందిస్తుంది. నాడీ మండలాన్ని చురుకుగా ఉంచుతుంది. ముత్యం అతివేడిని తగ్గిస్తుంది. ప్రశాంతతను సహనాన్ని ప్రసాదిస్తుంది.
రెండు వేరు వేరు గుణాలుగల ఈ రెండూరత్నాలూ ఆడవారి మంగళ సూత్రాలలో నిలిచి వారి ఆలోచనలను ఆరోగ్యాన్ని, రుతుక్రమాన్నీ సమతౌల్యంగా ఉంచడానికి దోహదపడతాయి.
Promoted Content