
Ravana Greater Than Lord Rama ?
“రావణాసురుడు ఉత్తముడు.
తనచెల్లిని అవమానించినందుకు రామునిభార్యను అపహరించాడు.
సీతను అపహరించినా ఆమెను తాకలేదు.
దూతను చంపకూడదని హనుమంతుని విడిచిపెట్టాడు.
తమ్మడు తననుండి దూరమై వెళ్ళినా సహించాడు.
రాముడు తనభార్యను అనుమానించి, అవమానించి వదిలిపెట్టాడు.” అంటూ రాముడికంటే రావణుడే గొప్పవాడు – అని ఈ మధ్య కొన్నిబృందాలు వ్యాసాలు వ్రాస్తున్నాయి. వీటికి సమాధానం ఏమిటి అని ఒక భక్తుడు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మ గారిని కోరగా వారు ఈ విదముగా సమాధానం ఇచ్చారు”
అర్థంలేని వ్యర్థ ప్రలాపాలు చాలాకాలంనుండి ఉన్నవే. వాటికి సమాధానాలుకూడా ఉన్నాయి. కానీ మనలో చాలామందికి రామాయణ పరిజ్ఞానంలేదు. దానిపై గౌరవంలేదు. కాసింత అవగాహన ఉన్న వాళ్ళుకూడా పై కువిమర్శలకు సమాధానం చెప్పగలరు. ఆ అవగాహన సైతం మన సమాజంలో కొరవడు తున్నందుకు బాధపడాలి.
4. రాముడు తనభార్యను అనుమానించి, అవమానించి వదిలిపెట్టాడ?
రాముడు బాలకాండనుండి ఉత్తరకాండ వరకు ఎక్కడ చూసినా, ఏ కోశానకూడా సీతమ్మను అనుమానించలేదు, అవమానించలేదు. ఒక ఉదాత్తమైన రాజధర్మానుసారం సీతమ్మను క్షేమంగా అరణ్యంలోని ఋషివాటికలకు పంపాడు. అది ప్రత్యేకంగా అధ్యయనం చేయవలసిన అంశం.
కాసింత ఆలోచించినా అర్థమయ్యే ఈ సామాన్య విషయాలు కూడా తెలియనిస్థితిలో మనయువతరం ఉంది. వారికి రామాయణాంశాలు స్పష్టంగా చెప్పవలసిన బాధ్యత పెద్దలది.
బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మ గారు
Promoted Content
Rama, laxnanulu avamanincha ledu… mandalinchi vadilipettaru ani vrayandi
Super sir
అసలు రాముడు చేసిన మంచి పనేంటో చెప్పండి. బ్రాహ్మణుల ఆదాయం కాపాడటం తప్ప ఆయన ఏ మంచి పని చేయలేదు.