
ఆరోగ్యపరంగా దానిమ్మ పండు | Pomegranate Health Benefits in Telugu
దానిమ్మ పండులో విటమిన్-ఎ, సి, ఇ, బి-5లు పుష్కలంగా ఉంటాయి. ధర కొంచెం ఎక్కువైనా దానికి సరిపడా లాభం చేస్తుంది దానిమ్మ. ఎర్రగా నిగనిగ లాడుతూ కంటికి ఇంపుగా కనిపించే దానిమ్మ గింజలు ఆరోగ్యానికి అనేక విధాలుగా ప్రయోజనం కలిగిస్తాయి. దానిమ్మ జ్యూస్ తాగితే గింజ ఎంత ఆకర్షణీయంగా ఉంటుందో అంత కాంతిని పొందుతారని పెద్దలు అంటుంటారు. అత్యంత శక్తిమంతమైన యాంటాక్సిడెంట్లు దానిమ్మలో ఎక్కువ. ఇవి కణాల విధ్వంసానికి కారణమయ్యే ఫ్రీరాడికల్స్ పని పట్టి వౄఎద్ధాప్యాన్ని దూరం చేస్తాయి. దానిమ్మ సహజ యాస్పిరిన్. రక్తసరఫరాను తగినంతగా వేగవంతం చేస్తుంది. పావు కప్పు రసం రోజూ తాగితే మీ గుండె ఎంచక్కా భద్రంగా ఉన్నట్టే. మరి అందానికి ఏవిధంగా ఉపయోగపడుతుందో చూద్దాం…
7. సూర్యకాంతి నుండి రక్షణ:
సూర్య కాంతి వలన కలిగే ప్రమాదాలను దానిమ్మ పండు ద్వారా తగ్గించుకోవచ్చు. సూర్య కాంతి వలన కలిగే ప్రమాదాలను, ఫ్రీ రాడికల్’ల వలన చర్మంపై కలిగే నష్టా లను మరియు చర్మ క్యాన్సర్ వంటి ప్రమాదకర వ్యాధులను కూడా తగ్గించి వేస్తుంది. ‘ఎల్లాజిక్ ఆసిడ్’ మరియు ‘పాలీఫినాల్ యాంటీ ఆక్సిడెంట్’లు దానిమ్మ పండులో ఉంటాయి, ఇవి చర్మంలో ఏర్పడే, క్యాన్సర్ ట్యూమర్ ఏర్పాటును అడ్డుకుంటాయి.







