
ఆరోగ్యపరంగా దానిమ్మ పండు | Pomegranate Health Benefits in Telugu
దానిమ్మ పండులో విటమిన్-ఎ, సి, ఇ, బి-5లు పుష్కలంగా ఉంటాయి. ధర కొంచెం ఎక్కువైనా దానికి సరిపడా లాభం చేస్తుంది దానిమ్మ. ఎర్రగా నిగనిగ లాడుతూ కంటికి ఇంపుగా కనిపించే దానిమ్మ గింజలు ఆరోగ్యానికి అనేక విధాలుగా ప్రయోజనం కలిగిస్తాయి. దానిమ్మ జ్యూస్ తాగితే గింజ ఎంత ఆకర్షణీయంగా ఉంటుందో అంత కాంతిని పొందుతారని పెద్దలు అంటుంటారు. అత్యంత శక్తిమంతమైన యాంటాక్సిడెంట్లు దానిమ్మలో ఎక్కువ. ఇవి కణాల విధ్వంసానికి కారణమయ్యే ఫ్రీరాడికల్స్ పని పట్టి వౄఎద్ధాప్యాన్ని దూరం చేస్తాయి. దానిమ్మ సహజ యాస్పిరిన్. రక్తసరఫరాను తగినంతగా వేగవంతం చేస్తుంది. పావు కప్పు రసం రోజూ తాగితే మీ గుండె ఎంచక్కా భద్రంగా ఉన్నట్టే. మరి అందానికి ఏవిధంగా ఉపయోగపడుతుందో చూద్దాం…
6. మృదువైన చర్మం:
దానిమ్మ పండు, చర్మంలోని కొల్లాజన్ మరియు స్థితిస్తాపకతను కలుగుచేసి చర్మాన్ని మృదువుగా మారుస్తుంది. ఈ పండు నుండి తయారు చేసిన రసం చర్మ కణాలలో ఫైబ్రోబ్లాస్ట్’లను వృద్ధి పరచి, చర్మ మృదుత్వాన్ని అధికం చేస్తుంది. అంతేకాకుండా, దానిమ్మ పండులో ఉండే ‘ప్యూనిక్ ఆసిడ్’, చర్మ కణాలలో ఉండే బ్యాక్టీ రియా మరియు మలిన పదార్థాలను తొల గించి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.







