సద్గురువు – సత్ప్రవర్తనగల శిష్యుడు

0
5466

story of kacha

మహా భారతం లో కచ దేవయానుల కథ చాలా ప్రసిద్ధమైనది. అందులో భాగంగా దేవగురువు బృహస్పతి కుమారుడైన కచునికీ, దైత్య గురువు శుక్రాచార్యునికీ మధ్య జరిగిన కథ మనకు ఎన్నో గొప్ప విషయాలను చెబుతుంది. ఆ కథను తెలుసుకుందాం.

8. దేవయాని శాపం

అతనిని వారించి దేవయాని తన మనసులోని కోరికను బయటపెట్టింది. అప్పుడా కచుడు ఆమెకు నమస్కరించి ‘ తల్లీ నీవు గురు పుత్రికవు నాకు సోదరీ సమానవు.

పైగా శుక్రాచార్యులవారు నాకు రెండుసార్లు ప్రాణదానం చేసినారు. ఆయన నాకు తండ్రి వంటివారు. ఒకే తండ్రి పిల్లలము అన్నా చెల్లెళ్లము అవుతాము. నీ కోరిక సరైనది కాదు.’ అన్నాడు.

అతని మాటలకు అవమానపడ్డ దేవయాని ‘ నీవు ఏ విద్యాకొరకైతే నా తండ్రివద్దకు వచ్చావో అది నీకు నిరుపయోగం అవుతుంది.’ అని శపించింది.

Promoted Content

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here