సద్గురువు – సత్ప్రవర్తనగల శిష్యుడు

0
5497

story of kacha

మహా భారతం లో కచ దేవయానుల కథ చాలా ప్రసిద్ధమైనది. అందులో భాగంగా దేవగురువు బృహస్పతి కుమారుడైన కచునికీ, దైత్య గురువు శుక్రాచార్యునికీ మధ్య జరిగిన కథ మనకు ఎన్నో గొప్ప విషయాలను చెబుతుంది. ఆ కథను తెలుసుకుందాం.

3. శుక్రాచార్యుని వద్ద కచుని శిష్యరికం

తండ్రి మాటకు కట్టుబడిన కచుడు శుక్రాచార్యుని వద్దకు శిష్యునిగా వెళ్ళాడు. తాను దేవగురు బృహస్పతి కుమారుడనని, విద్యార్థిగా తనవద్దకు వచ్చాననీ చెప్పాడు.

కచుని నిజాయితీకి, వినయవిధేయతలకు సంతోషపడ్డ శుక్రాచార్యుడు అతనిని తన శిష్యునిగా అంగీకరించాడు.

కచుడు రోజూ సూర్యోదయానికి ముందేలేచి కాలకృత్యాలు తీర్చుకుని, నదిలో స్నానాది క్రియలు , సంధ్యావందనం క్రమం తప్పకుండా చేసేవాడు.

నిష్కళంకమైన బ్రహ్మచర్య దీక్షను పాటించేవాడు. ఎంతో భక్తితో గురువైన శుక్రాచార్యునికి సేవలు చేసేవాడు. శ్రద్ధగా ఆయనవద్ద విద్యను అభ్యసించేవాడు.

Promoted Content

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here