
5. ఆలయ ప్రత్యేకతలు
ప్రతియేటా కార్తీక శుద్ధ ద్వాదశి రోజు స్వామి కళ్యాణోత్సవం నిర్వహిస్తుంటారు. ఆ రోజున స్వామి ప్రసాదం స్వీకరిస్తే ఏడాది లోగా సంతాన వంతులవుతారని భక్తుల నమ్మకం కార్తిక మాసంలో పౌర్ణమి నాటికి పూర్తయ్యే విధంగా ఐదు పౌర్ణమిలకు ఐదు సత్యనారాయణ వ్రతాలు నిర్వహిస్తే అనుకున్న పనులు నేరవేరుతాయని భక్తుల నమ్మకం. లక్ష్మీ నర్సింహస్వామి ఆలయంలో గత 50 ఏళ్లుగా నిరంతరంగా వెలుగుతున్న అఖండ జ్యోతిని దర్శిస్తే దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం అవుతాయని ఇక్కడి భక్తుల విశ్వాసం. ఆలయ విశిష్టతను అనుసరించి కార్తీక శుద్ధ ఏకాదశి నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం అవుతాయి. కార్తీక శుద్ధ ద్వాదశి రోజున కళ్యాణోత్సవం, కార్తీక బహుళ పంచమి రోజున రథోత్సవం జరుపుతుంటారు.
నలుపురాతి దుఖానికి చిహ్నమని భగవంతున్ని ప్రార్థిస్తే దుఖం పోతుందని భక్తుల విశ్వాసం. ఇలాంటి దేవాలయమే ఈ పరిసర ప్రాంతంలోని బేల మండలం సదల్ పూర్లో మరో ఆలయాన్ని కూడా నిర్మించారు. దీంతో పాటు తలమడుగు మండలం ఝరి గ్రామంలో రాజరాజేశ్వరి ఆలయాన్ని కూడా ఆనాటి కాలంలోనే నిర్మించి నట్లు చరిత్ర చెబుతుంది. జైనథ్ లక్ష్మీ నర్సింహస్వామి ఆలయం నుంచి చూస్తే జైనథ్ రాజరాజేశ్వరి ఆలయం పై వెలుగుతున్న దీపం కనిపించేదని ఇక్కడి భక్తులు చెబుతుంటారు. అతి పురాతన ఆలయం అయిన జైనథ్ మండల కేంద్రంలోని లక్ష్మీ నర్సింహ స్వామి దేవాలయాన్ని సందర్శించి కోరిన కోరికలు భక్తులు నేరవేర్చుకుంటారని ఆశిద్దాం.
-లింగన్న, ఆదిలాబాద్
లక్ష్మీ దేవి ఎక్కడ ఎక్కడ నిలువ వుండదో మీకు తెలుసా? | Lakshmi Devi Does not stay in Telugu