నరసింహావతారం చాలింపజేసింది శివుడా? | Narasimha Avatar Story

0
1598
Narasimha Swamy Avatar End by Lord Shiva
Narasimha Swamy Avatar End by Lord Shiva

Narasimha Swamy Avatar End by Lord Shiva

2హిరణ్యకశిపుడు వరం (Hiranyakashipu Boon)

హిరణ్యాక్షుణ్ని యొక్క మరణ విషయం తెలుసుకున్న హిరణ్యకశిపుడు, తనకు కూడా విష్ణు మూర్తి వల్ల ఆపద పొంచి ఉంది అని తెలుసుకుంటాడు. హిరణ్యకశిపుడు మహా శివుడు వరం కోసం కఠోర తపస్సు చేశాడు. అతడి తపస్సుకు మెచ్చిన శివుడు ఏదైనా వరం కోరుకోమన్నాడు. అప్పుడు హిరణ్యకశిపుడు ఇలా కోరుకున్నాడు. అతన్ని మానవుడు లేదా జంతువు, బయట లేదా ఇంట్లో, పగలు లేదా రాత్రి, గాలి పై లేదా నీటిలో లేదా భూమిలో, అస్త్రం లేదా ఏ శస్త్రములు వలన నాకు చావు రాకుడదు అని కోరుకుంటాడు. శివుడు అతను కోరుకున్న వరాన్ని ఇస్తాడు. రణ్యకశిపుడు ఈ వరం అహంకారాన్ని కలిగించింది. తనను మాత్రమే దేవుడిగా పూజించాలని , అంగీకరించని ప్రజలు శిక్షించి చంపాలని ఆదేశించాడు.

ప్రహ్లాదుడు జననం (Prahlada Birth)

హిరణ్యకశిపుడుకి ఒక కొడుకు జన్మిస్తాడు. అతని పేరే ప్రహ్లాదుడు. తను మహావిష్ణువు కి మహా భక్తుడు. ప్రహ్లాదుడు తండ్రిని దేవుడిగా నిరాకరించాడు. దీనితో కోపం వచ్చిన హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని చంపడానికి తని సోదరి హోళికను పిలిచాడు. అప్పుడు హోళిక ప్రహ్లాదుని అగ్నికి ఆహుతి చేద్దాం అని అనుకుంటుంది. కాని తనే ఆ మంటల్లో కాలిపోతుంది. ఇలా తన సైనికులు కూడ చాల విధాలుగా చంపడానికి చుస్తారు కాని మహ విష్ణువు మహిమ వలన ఏదో విధంగా బ్రతుకుతాడు.