
Mighty Weapons of Hindu Gods
3సుదర్శన చక్రం (Sudarshana Chakra):
మహ విష్ణు ప్రతి చిత్రం, విగ్రహల్లో మనం అతని చూపుడు వేలుపై ఉన్న సుదర్శన చక్రాన్ని చూసే ఉంటాం. ఈ ఆయుధం చాలా ప్రమాదకరమైనదిగా పురాణాల్లో చేప్పబడింది. ఇది సూర్యుని ధూళి, శివుని త్రిశూలం నుండి తయారు చేయబడినదిగా చెబుతారు. ఈ ఆయుధాన్ని దేవతల రూపశిల్పి అయిన విశ్వకర్మ తయారు చేశాడు. ఈ ఆయుధాన్ని పరమశివుడు విష్ణువుకు బహుమతిగా ఇచ్చాడు.
బ్రహ్మాండ అస్త్రం (Brahmanda Astra):
ఈ అస్త్రాన్ని సప్త ఋషులు కలిసి అన్ని ఇతర ఆయుధాలను ఎదురించడానికి సృష్టించారు. ఇది దేవతల అత్యంత శక్తివంతమైన ఆయుధాలలో ఒకటి. విశ్వామిత్ర మహర్షి దండయాత్రను సమర్థిస్తూ బ్రహ్మ ఋషి అయిన వశిష్ఠుడు ఈ ఆయుధాన్ని ప్రయోగించాడు.
బ్రహ్మశిర (Brahmashirsha astra):
ఈ ఆయుధం బ్రహ్మాస్త్రం కంటే చాలా రెట్లు శక్తివంతమైనది. బ్రహ్మశిర ఆయుధం ప్రయోగిస్తే వినాశకరమే. ఇది దశాబ్దాల పాటు భూమిని బంజరుగా మార్చగలదు అంటే భుమండలం మొత్తం మీద గడ్డిపోచ కూడ మొలవదు అంతటి శక్తివంతమైనది. రామాయణంలో ఇంద్రజిత్ దీనిని ప్రయోగించాడు అని చెబుతారు. మహాభారతంలో కూడ పాండవుల వంశాన్ని అంతం చేయడానికి అశ్వత్థామ ఈ ఆయుధాన్ని ఉపయోగించాడని చెబుతారు.
మరిన్ని ఆయుధాల కోసం తరువాతి పేజీలో చూడండి.