
2. గోత్రం అంటే ఏమిటి?
గోత్రం అంటే అసలైన అర్థం గోవు,గురువు,భూమి, వేదం అనే అర్ధాలున్నాయి. మరి వీటికీ మనకీ సంబంధం ఏమిటి? ప్రాచీన మానవులు తమ దగ్గర ఉన్న ఆవుల రంగును బట్టి అంటే తెల్లావుల వాళ్ళు, నల్లావుల వాళ్ళు అనే పేర్లను గోత్రాలుగా, తమకు విద్యనేర్పించిన గురువులను బట్టి అంటే వశిష్ట, విశ్వామిత్ర మొ. న వారి పేర్లను తమ గోత్రాలుగానూ చెప్పుకున్నారు. ఇది ఒక పద్ధతి. ఇలా కాకుండా చాలా మంది తమ వంశం లోని మూల ఋషి పేరు గోత్రంగా కలిగి ఉన్నారు. ఆ గోత్రానికి చెందిన వారంతా ఒకే సంతతి.
Promoted Content