
Manidweepa Varnana Lyrics in Telugu PDF
2మణిద్వీపవర్ణన – 2
భువనేశ్వరి సంకల్పమే జనియించే మణిద్వీపము |
దేవదేవుల నివాసము అదియే మనకు కైవల్యము ||
కోటి ప్రకృతుల సౌందర్యాలు
సకల వేదములు ఉపనిషత్తులు |
పదారురేకుల పద్మశక్తులు
మణిద్వీపానికి మహానిధులు || ౨౧ ||
దివ్యఫలములు దివ్యాస్త్రములు
దివ్యపురుషులు ధీరమాతలు |
దివ్యజగములు దివ్యశక్తులు
మణిద్వీపానికి మహానిధులు || ౨౨ ||
శ్రీ విఘ్నేశ్వర కుమారస్వాములు
జ్ఞానముక్తి ఏకాంత భవనములు |
మణినిర్మితమగు మండపాలు
మణిద్వీపానికి మహానిధులు || ౨౩ ||
పంచభూతములు యాజమాన్యాలు
ప్రవాళసాలం అనేక శక్తులు |
సంతానవృక్ష సముదాయాలు
మణిద్వీపానికి మహానిధులు || ౨౪ ||
భువనేశ్వరి సంకల్పమే జనియించే మణిద్వీపము |
దేవదేవుల నివాసము అదియే మనకు కైవల్యము ||
చింతామణులు నవరత్నాలు
నూరామడల వజ్రపురాశులు |
వసంతవనములు గరుడపచ్చలు
మణిద్వీపానికి మహానిధులు || ౨౫ ||
దుఃఖము తెలియని దేవీసేనలు
నటనాట్యాలు సంగీతాలు |
ధనకనకాలు పురుషార్ధాలు
మణిద్వీపానికి మహానిధులు || ౨౬ ||
పదునాలుగు లోకాలన్నిటి పైన
సర్వలోకమను లోకము కలదు |
సర్వలోకమే ఈ మణిద్వీపము
సర్వేశ్వరికది శాశ్వత స్థానం || ౨౭ ||
చింతామణుల మందిరమందు
పంచబ్రహ్మల మంచముపైన |
మహాదేవుడు భువనేశ్వరితో
నివసిస్తాడు మణిద్వీపములో || ౨౮ ||
భువనేశ్వరి సంకల్పమే జనియించే మణిద్వీపము |
దేవదేవుల నివాసము అదియే మనకు కైవల్యము ||
మణిగణఖచిత ఆభరణాలు
చింతామణి పరమేశ్వరిదాల్చి |
సౌందర్యానికి సౌందర్యముగా
అగుపడుతుంది మణిద్వీపములో || ౨౯ ||
పరదేవతను నిత్యముకొలచి
మనసర్పించి అర్చించినచో |
అపారధనము సంపదలిచ్చి
మణిద్వీపేశ్వరి దీవిస్తుంది || ౩౦ ||
నూతన గృహములు కట్టినవారు
మణిద్వీపవర్ణన తొమ్మిదిసార్లు |
చదివిన చాలు అంతా శుభమే
అష్టసంపదల తులతూగేరు || ౩౧ ||
శివకవితేశ్వరి శ్రీచక్రేశ్వరి
మణిద్వీప వర్ణన చదివిన చోట |
తిష్టవేసుకుని కూర్చొనునంట
కోటిశుభాలను సమకూర్చుటకై || ౩౨ ||
భువనేశ్వరి సంకల్పమే జనియించే మణిద్వీపము |
దేవదేవుల నివాసము అదియే మనకు కైవల్యము ||
Goddess Sri Lalitha Posts:
Manidweepa Varnanam (Devi Bhagavatam) Part 1 in Telugu | మణిద్వీపవర్ణనం (దేవీభాగవతం) – 1
శ్రీ లలితా షోడశోపచార పూజ – Sri Lalitha Shodasopachara Puja in Telugu
శ్రీ లలితా సహస్ర నామ స్తోత్రం ఉత్తరపీఠిక – Sri Lalitha Sahasranama Stotram Uttarapeetika
శ్రీ లలితా సహస్రనామ స్తోత్రరత్నం పూర్వపీఠికా – Sri Lalitha Sahasranama Stotram Poorvapeetika
శ్రీ లలితా త్రిశతీ స్తోత్రరత్నం ఫలశృతి (ఉత్తర పీఠిక) – Sri Lalitha Trisati Stotram Uttarapeetika
శ్రీ లలితా త్రిశతీ స్తోత్రరత్నం – Sri Lalitha Trishati Stotram
శ్రీ లలితా త్రిశతీ స్తోత్రరత్నం పూర్వపీఠిక – Sri Lalitha Trisati Stotram Poorvapeetika
శ్రీ లలిత అష్టోత్తర శతనామావళి – Sri Lalitha Ashtottara Satanamavali
శ్రీ లలితా ఆర్యా ద్విశతీ స్తోత్రం – Sri Lalitha Arya Dwisathi