kumaraswami |కుమారస్వామికి శివపార్వతులిచ్చిన ‘ఫలం’… పళని

0
10029

murugan1

kumaraswami and shiva parvati

3. పళని వైభవం

పళనిలోని మురుగన్‌ ఆలయం సహజ సిద్ద మైన ప్రకృతి శోభలతో విలసిల్లే కన్నుల పం డుగైన కొండపై నిర్మితమైంది!.

దీనిని ‘మురు గన్‌ కొండ’ అని కూడా అంటారు. ఆలయ సందర్శనకు 659 మెట్లను ఎక్కవలసి ఉంది. అంత శక్తి లేని వారి కోసమై ‘ఏరియల్‌ రోప్‌ – వే’ ఏర్పాటు చేయబడింది.

గిరి ప్రదక్షిణకో సమై కొండ చుట్టూరా చక్కని రోడ్డు వేయబ డింది. సాధారణంగా భక్తులు ముందు గిరిప్ర దక్షిణ చేసి ఆ తర్వాత కొండ ఎక్కుతారు!.

మెట్లన్నీ ఎక్కి కొండపై భాగం చేరగానే చు ట్టూరా కనిపించే సుందర ప్రకృతి దృశ్యాలు మనసును పులకింపజేస్తాయి.

మొట్ట మొదట మనకు మనోహరమైన రాజగోపురం దర్శన మిస్తుంది. గోపుర ద్వారం గుండా కాస్త ముం దుకు వెలితే వరవేల్‌ మండపం కనిపి స్తుంది.

ఈ మండప స్థంబాలు అ త్యంత సుందరమైన శిలా చిత్రాల తో మంత్రముగ్ధులుగావిస్తాయి. మండపం తర్వాత నవరంగ మండపం ఉంది. ద్వారం వద్ద ద్వారపాలకుల విగ్రహాలు ఆకర్షణీయంగా మలచబడ్డాయి.

Promoted Content

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here