kumaraswami and shiva parvati
2. పళని స్థలపురాణం
శివదేవుడు ఒక సందర్భంలో త న ఇరువురు ప్రియ పుత్రులైన గణేశుని, కు మారుని పిలిచి, యావత్తు విశ్వాన్ని ఎవరు ముందుగా ప్రదక్షిణ చేసి వస్తారో, వారికి ఒక అద్భుతమైన ఫలాన్ని ఇస్తానని చెప్తారు.
వెంటనే కుమార స్వామి నెమలి వాహనం ఎక్కి విశ్వాన్ని చుట్టి రావడానికి బయల్దేరుతా డు. తన వాహన వేగం ఏమిటో బాగా తెలిసి న వినాయకుడు కొద్దిసేపు ఆలోచించి, విశ్వ రూపులైన తన తల్లి, తండ్రుల చుట్టూ అత్యం త భక్తి శ్రద్ధలతో ప్రదక్షిణ గావించి ఆ అద్భత ఫలాన్ని పొందుతాడు.
త్వరత్వరగా విశ్వప్ర దక్షిణం పూర్తి గావించుకొని వచ్చిన సుబ్రహ్మ ణ్యస్వామి జరిగిన సంగతి తెలుసుకొని అలుగుతాడు.
అది చూసి శివ దేవుడు జాలిపడి ‘‘అన్న య్యకు ఇచ్చిన ఫలం గురించి నీకెందుకు చింత! నీవే ఒక అద్భుత ఫలానివి ‘ఫలం- ని’! నీ పేరిట ఒక సుందర మహిత పుణ్య క్షేత్రం ఏర్పడేటట్లు అనుగ్రహిస్తున్నాను, అది నీ స్వంత క్షేత్రం, అక్కడికి వెళ్లి నివా సం ఉండు’’ అంటూ కుమారుని బుజ్జగించా డు. దీంతో వైభవమైన ‘పళని’ రూపుదిద్దు కుంది. అది కుమారుని విశిష్ట నివాస క్షేత్రమయింది!