4. ఈ ప్రయాణంలో మనం తెలుసుకోవలసింది ఏమిటి?
ప్రయాణంలో ప్రతి మజిలీలో మనలాంటి చాలామంది ప్రయాణికులు తారసపడుతుంటారు. కొంతమంది సహ ప్రయాణికులు అవుతారు కూడా. ఉదాహరణకు కన్నవాళ్లు కూడా సహప్రయాణికులే. మనకన్నా ముందు మొదలుపెట్టారు అంతే. తేడా అల్లా మనం వారి దగ్గరనుంచీ మన ప్రయాణాన్ని మొదలు పెడతాము. వాళ్ళు అప్పటికే కొంతదూరం ప్రయాణం చేసి అనుభవాన్ని గడించి ఉంటారు. తరువాత అక్కా చెల్లెళ్ళు, అన్న, తమ్ముడు, భార్య (ప్రియురాలు). మనమెలా ప్రయాణం ప్రారంభించామో అలానే జీవనాన్ని మొదలుపెట్టే పిల్లలు, ఇలా చాలామంది, స్నేహితులు, చేదువు నేర్పే ఉపాధ్యాయులూ, సహోద్యోగులు కూడా సహ ప్రయాణికులే.
వీళ్ళంతా మనపై ఒక్కొక్కరూ ఒక్కో విధంగా ప్రభావం చూపుతారు. జీవితం మొత్తం మీద వీరి ప్రభావం ఉంటుంది.
ప్రతి మనిషి జీవితంలోనూ ఉండే simple logic ఇది. కొంచెం గజిబిజిగా కనిపించినా ఇది చాలా మామూలు విషయమే.
అందుకే ఒక పెద్దాయన అన్నారు “Life is simple but it is attitude which makes it complicated” అని. దీని అర్థం, జీవితం చాలా సరళం, కానీ మనమే దాన్ని గజిబిజిగా అర్థం చేసుకుంటాం, అని. మన వ్యవహార సరళి, పరిస్థితులను ఆకళింపు చేసుకునే తత్వం పై ఆధారపడి జీవితం మనకు సాక్షాత్కారమవుతుంది.
జై మాతంగి _/ii\_
Promoted Content
Super