
5. కైలాసం లో ఏమి జరిగింది?
కుబేరుడు కైలాసం చేరేసరికి వినాయకుడు పరమ శివునికి కుబేరునిపై ఫిర్యాదు చేస్తున్నాడు. తనని అర్ధాకలితో పంపించి వేశాడని తండ్రితో అన్నాడు. పరమ శివుడు వినాయకుని శాంతపరిచి, అమ్మ దగ్గరకు వెళ్ళి తృప్తిగా భోజనం చేయమని సర్ది చెప్పాడు. ఈ దృశ్యం చూసి గడగడా వణికిపోతున్న కుబేరుని వైపు చూసి చిరుమందహాసం తో అతనిని శంకరుడు మన్నించాడు. కుబేరుడు బతుకు జీవుడా అని తన స్థానానికి వెళ్ళాడు. ధనం చూసుకుని గర్వపడి పెద్ద పొరపాటు చేశానని తనను తాను పరిపరి విధాల నిందించుకున్నాడు.
Promoted Content