karthika masam offerings
ఇక పై రోజు శుభ సమయం కోసం మన AstroTags అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకోండి.
వీటితో పాటు మీ జన్మ వివరాలు బట్టి రోజు మీరు ఏ పని చేయాలో ఏ పని చేయకూడదో తెలుసుకోండి. మరిన్ని వివరలకు
https://onelink.to/ppsjem
ఏ రోజుననైనా, ఏ సందర్భంలోనైనా ఎదుటి వ్యక్తికి ఉపయోగపడే ఏ వస్తువునైనా దానం చేయటం మంచిదే! కార్తిక మాసంలో దానం ఇంకా మంచిది.
3. ఫలప్రదానం
కార్తిక మాసంలో ఫలప్రదానం చాలా మంచిది. ఒక పళ్లెంలో కొన్ని పండ్లను, పూలను, పసుపు కుంకుమలను, గంధాన్ని ఆర్థిక స్తోమత ఉంటే చీర, రవిక గుడ్డలను, లేదా ఒక రవికె గుడ్డను ఉంచి దేవుడి ముందు పెట్టి
శ్లో|| ఇదం ఫలం మయా దేవ
స్థాపితం పురతస్తవ
తేన మే సఫలావాప్తిః
భవేజ్జన్మని జన్మని ||
-అనే శ్లోకాన్ని పఠించాలి.
ఒక పండు ముతైదువను మన ఇంటికి ఆహ్వానించి, ఆమెగారి పాదాలకు స్వయంగా పసుపు రాచి, మెడకు గంధాన్ని పూసి, నొసటన కుంకు బొట్టును పెట్టి, సిగలో పూలుపెట్టి, ఈ పండ్లు మొదలైన వాటి నామె కిచ్చి, ఆమె పాదాలకు భక్తితో నమస్కారం చేసి, ఆమె చేత తలమీద అక్షతలను వేయించుకోవాలి. ఈ ఆశీర్వచనం వలన దీర్ఘ సుమంగళీత్వం సిద్ధిస్తుంది. సత్సంతానం కలుగు తుంది. కుటుంబ సౌఖ్యమబ్బుతుంది.