
3. తుమ్ము అశుభమని ఎవరన్నారు? ఎందుకు?
బృహస్పతి శకున ప్రకరణం లోనూ, గర్గుని సూత్రాలలోనూ తుమ్ము అశుభం అని చెప్పబడింది. అయితే ఇందులో కేవలం ‘ఆరోగ్యవంతుని తుమ్ము మాత్రమే పరిగణించాలి’ అని కూడా ప్రస్తావించారు. ఆరోగ్యవంతుడు అకాలంలో తుమ్ముతున్నాడు అంటే అక్కడి వాతావరణం లో ఏదైనా అనారోగ్యకరమైన మార్పు జరిగిందని అర్థం. అందుకని ఏదైనా శుభాన్ని మొదలు పెట్టేటప్పుడు ఎవరైనా తుమ్మితే అశుభం అనుకుంటారు. ఆ క్షణం గుండె కొట్టుకోవడం ఆగడం వల్ల దాదాపుగా మరణం సంభవించినట్లు భావించి ‘ చిరంజీవ..! చిరంజీవ..!’ అనీ ‘శ్రీ రామ రక్ష’ అనీ ‘దీర్ఘాయురస్తు’ అనీ అంటారు.
Promoted Content







