
IRCTC Tourism One Day Divine Balaji Darshan Package
2డివైన్ బాలాజీ దర్శన్ పర్యటన ప్యాకేజీ వివరాలు (Divine Balaji Darshan Package Details)
దేశంలోని ప్రధాన నగరాల నుంచి తిరుపతి వచ్చే భక్తుల కోసం ఐఆర్‌సీటీసీ రూపొందించిన ప్రత్యేక ప్యాకేజీ ఇది. ఈ టూర్ ప్యాకేజీ ధర రూ.990 కావడం విశేషం. పెద్దలకు, పిల్లలకు ఒకే ధర. పూర్తి వివరాలు తెలుసుకుందాం.
1. ఈ టూర్ ప్యాకేజీ ఉదయం 8.30 గం.కు తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి మొదలవుతుంది. భక్తులు తిరుపతికి వచ్చిన తర్వాతే ఈ ప్యాకేజీ మొదలవుతుందన్న విషయం గుర్తుంచుకోవాలి. ఇందులో రైలు టికెట్లు ఉండవు.
2. రైల్వే స్టేషన్‌లోని ఐఆర్‌సీటీసీ కౌంటర్ దగ్గర భక్తుల్ని సిబ్బంది ఆహ్వానిస్తారు. అక్కడి నుంచి తిరుమలకు బయల్దేరాలి.
3. తిరుమలలో ప్రత్యేక దర్శనం టికెట్ ద్వారా శ్రీవారిని దర్శించుకోవాలి.
4. దర్శనాంతరం తిరిగి తిరుపతి రైల్వే స్టేషన్‌లో దింపడంతో టూర్ ముగుస్తుంది.
ఇది కేవలం ఒక రోజు టూర్ ప్యాకేజీ మాత్రమే. ఈ ప్యాకేజీలో తిరుపతి నుంచి తిరుమలకు, తిరుమల నుంచి తిరుపతికి ఏసీ వాహనంలో వెళ్ళిరావడం, తిరుమలలో ప్రత్యేక దర్శనం, ప్రయాణపు భీమా మాత్రమే కవర్ అవుతాయి. భోజనం, గది వసతివి లాంటివి ఈ ప్యాకేజీలో ఉండవు. మరో ప్యాకేజీ కోసం తరువాతి పేజీలో చూడండి.