
Interesting Facts About Tirumala Routes
3శ్రీవారి మెట్టు (Srivari Mettu)
ఈ మార్గం చాల కొద్ది మందికి మత్రమే తెలిసిన మార్గం. ఇది శ్రీనివాస మంగాపురంకి 10 కి.మీ. ల దూరంలో మొదలౌతుంది. శ్రీ వేంకటెశ్వర స్వామి పద్మావతి అమ్మవారిని కళ్యాణం చేసుకోని ఈ మార్గం ద్వారానే తిరుమలకు చేరుకున్నారు అని శాస్త్రాలు చెబుతున్నాయి. అందుకే ఇది శ్రీవారి మెట్టుగా పేరు వచ్చింది. ఈ దారి గూండా 3 కిలోమీటర్లు నడిస్తే తిరుమలకు చేరుకుంటాము. ఈ మెట్ల దారిన నడిస్తే ఒక గంటలో శ్రీవారి ఆలయం చేరుకుంటాము. చంద్రగిరి దుర్గం నిర్మించిన తరువాత ఈ దారికి ప్రాముఖ్యం లభించింది. చంద్రగిరికి 8 కి.మీ.ల దూరంలో శీవారి మెట్లు ఉన్నాయి. చంద్రగిరి రాజులూ ఈ దారిలోనే తిరుమలకు వచ్చేవారు. అలిపిరి కన్నా తక్కువ సమయంలో ఏడుకొండలు ఎక్కేయవచ్చు. శ్రీకృష్ణదేవరాయలు శ్రీవారి దర్శంనం కోసం విచ్చేసినప్పుడు చంద్రగిరిలో విడిది చేసి, శ్రీవారి మెట్టు దారిలోనే ఏడు సార్లు శ్రీవారిని దర్శించుకున్నారంటా. అప్పట్లో కూరగాయలు, పాలు, పెరుగు ఈ దారిలోనే ఎక్కువగా తీసుకువెళ్తుండేవారట.