అద్భుత గుణాల తులసి | Tulasi Plant Importance in Telugu

0
11146

importance-of-tulsi-plant-in-ayurvedic-medicine

tulasi plant Importance

Next

2. తులసి యొక్క ఆరోగ్య ప్రయోజనాలు

  • తులసి… రసం తీసుకుని ప్రతీరోజు 2 చెమ్చాలు పుచ్చుకుంటే రక్తపుష్టి కలిగి, శరీరమునకు కాంతి వస్తుంది.
  • తులసి రసం 2 చెమ్చాలు, తేనె 1 చెమ్చా కలిపి ప్రతీరోజు పుచ్చుకుంటే (శ్లేష్మం) కఫం, దానికి సంభందించిన వ్యాధులు దూరమవుతాయి.
  • ఒక గుప్పెడు తులసి ఆకులను రెండు చేతులతో బలంగా నలిపి, రసం పిండి, ఆ రసాన్ని తేలు, తేనెటీగ, కందిరీగ మొదలైనవి కుట్టినప్పుడు ఆ ప్రాంతంలో రాస్తే నొప్పి తగ్గి, విషప్రభావం తగ్గుతుంది.
  • ప్రతీరోజు క్రమం తప్పకుండా 10 లేక 15 తులసి ఆకులను నమిలి, తింటూ ఉంటే, శరీరంలో వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. ఈ వ్యాధినిరోధక శక్తి పాము విషాన్ని కూడా హరిస్తుంది.
  • తులసిరసం వల్ల దగ్గు, ఆయాసం, గొంతునుండి పిల్లికూతలు రావటం వంటి వ్యాధులను తగ్గించుకోవచ్చును.
  • తులసిరసం కంటికింద రాసుకుంటే నల్లని వలయాలు, ఉబ్బులు తగ్గుతాయి.
  • తులసిరసం, నిమ్మరసం కలిపి పైపూతగా పూస్తే గజ్జి, తామర వంటి చర్మరోగాలు నశిస్తాయి.
  • తులసిరసాన్ని పంచదారతో కలిపి ప్రతీరోజు పడుకునే ముందు తీసుకుంటే, బాగా నిద్రపడుతుంది, నిద్రలేమితో బాధపడేవారికి ఇది మంచి ఔషధము.
  • తులసిరసాన్ని ప్రతీరోజు క్రమంతప్పకుండా తీసుకుంటే చెడు కొవ్వును & రక్తపోటును నిరోధిస్తుంది.
  • తులసి ఆకుల కషాయాన్ని పరగడుపునే త్రాగితే, కీళ్ళనొప్పులు, నడుంనొప్పి, వెన్నెముక నొప్పి, పొత్తికడుపు మంట వంటి వాటిని నివారించవచ్చును.
  • తులసిఆకులు ఎండపెట్టి, పోడిచేసుకుని, కొద్దిగా వేడినీటిలో కలిపి, ఆ లేపనాన్ని ముఖానికి పట్టిస్తే, చర్మ సౌందర్యం పెరిగి శరీరం కాంతివంతంగా, సున్నితంగా తయారవుతుంది.
Promoted Content
Next

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here