
రథ సప్తమి ఏమి చెయాలి? What Should be Done on Ratha Saptami?
రకరకాల పత్రాలలో రకరకాల ఫలాలలో రకరకాల ఔషధ శక్తులు ఉంటూ ఉంటాయి. ఆ ఔషధ శక్తులను బట్టి వాటి వినియోగం ఉంటుంది. అలాగే వివిధ కాలాలలో వివిధ బుతువుల మార్పులలో ఒక్కొక్క పత్రానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటూ ఉంటుంది.
2రథ సప్తమి రోజున చిక్కుడు ఆకులతో రథం ఎందుకు చేస్తారు? (Why is the Chariot Made With Legume Leaves on Ratha Saptami?)
ఇంక చిక్కుడు ఆకులతో రథం తయారు చేస్తారు. రథాన్ని ఆకులతో, చిక్కుడు కాయలతో చేయడం అనేఅంతరార్థంలో కూడా ఈ చిక్కుడు మనకు ఒక వ్యవహారం ఉన్నది లోకంలో. రథసప్తమి తర్వాత చిక్కుడు కాయలు తినకూడదు అంటారు. ఎందువల్ల అంటే పురుగు పడుతుందిట. ఆ సౌరశక్తి గమనానికీ వీటికి ఏదో ప్రత్యకత ఉన్నది. సౌరశక్తి విశేషంగా గ్రహించగలిగేటటువంటి ఈ ఓషధీ పత్రాలనీ వాటినే మనం పూజకి వినియోగిస్తున్నాం. తులసి గానీ, మారేడు గానీ అదేవిధంగా ఈ ద్రవ్యములు గానీ ఒక్కొక్క దేవతా శక్తికి సంబంధించిన ఒక్కొక్క ప్రత్యేకత కలిగివున్నవి. ఈ చిక్కుడు, జిల్లేడు కూడా విశేషమైన సౌరశక్తిని గ్రహించుతున్నాయి గనుక వీటిని మనం ఈ క్రియలో వాడుతూ ఉంటాం. పైగా చిక్కుడు కాయలతో రథాన్ని తయారు చేసి చిక్కుడు ఆకు మీద లేదా తమలపాకు మీద రక్తచందనంతో బింబాన్ని చేసి దానియందు సూర్య భగవానుని ఆవాహనం చేసి ఆరాదించటం అనేది ఈరోజున కొందరు సంప్రదాయం పాటిస్తు ఉంటారు.
Related Posts
Sri Surya Ashtottara Shatanamavali Lyrics | Lord Surya Stotra
శ్రీ సూర్య అష్టోత్తరశతనామ స్తోత్రం – Sri Surya Ashtottara Satanama Stotram in Telugu
Sri Surya Ashtottara Shatanama Stotram | శ్రీ సూర్య అష్టోత్తర శతనామ స్తోత్రం
Dvadasa Aditya Dhyana Slokas Lyrics in English | Lord Surya Stotras