
If You Do Not Have Rs 300 Special Darshan Tickets Then How to Get Darshan With Free Tickets
2ఉచిత టిక్కెట్లతో శ్రీవారి దర్శనం ఎలా పొందాలి? (How to Get Srivaari Darshanam With Free Tickets?)
ఆన్‌లైన్‌లో టికేట్లను తీసుకోని వారి కోసం టీటీడీ ఉచిత దర్శనం అవకాశాన్ని కల్పిస్తుంది. ఇవి ఉదయం 5 నుంచి రాత్రి 9 గంటల వరకు ఇస్తారు. ఈ టికేట్లు తిరుపతి రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న విష్ణు నివాసం, రైల్వేస్టేషన్ వెనక ఉండే గోవింద రాజుల సత్రాలు, సెంట్రల్ బస్ స్టేషన్ సమీపంలో ఉండే శ్రీనివాసం కౌంటర్లలో అందుబాటులో ఉంటాయి. మెట్ల మార్గం ద్వారా వచ్చే భక్తులకు ప్రత్యేకంగా దర్శనం టికెట్లను ఇస్తారు.
అలిపిరి మెట్ల మార్గం ద్వార నడిచి వచ్చే భక్తులు భూదేవి కాంప్లెక్స్ లో దర్శనం టోకెన్లు తీసుకోవాలి. ఈ కౌంటర్లు తెల్లవారు జామున 3 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు అందుబాటులో ఉంటాయి. ఇదే విధంగా శ్రీవారి మెట్ల మార్గం ద్వార వచ్చె భక్తులు దారి మధ్యలో ఉన్న కౌంటర్లో తెల్లవారు జామున 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు దర్శనం టోకెన్లను ఇస్తారు.