
5. సూర్యుని ఆలోచన
సూర్యుడు వెంటనే బ్రాహ్మణ వేశాన్ని ధరించి జమదగ్ని మహర్షి వద్దకు వెళ్ళి నమస్కరించాడు. ఆయనను చూసి గాలిలో బాణాలు వేస్తున్నారెందుకు? అని అడిగాడు. అప్పుడు మహర్షి ‘ గాలిలో కాదు సూర్యుని శిక్షిస్తున్నాను అన్నాడు.
అప్పుడు బ్రాహ్మణ వేషం లోని సూర్యుడు స్వామీ అంతా దూరం మీ బాణాలు ఎలా వెళ్తాయి అనగానే మధ్యాహ్న సమయానికి సూర్యుడు ఆకాశం లో మధ్యభాగానికి చేరుకుంటాడు అప్పుడు తప్పకుండా నా బాణాలు అతని దాకా వెళతాయి. అన్నాడు.
ఆ మాటలకు ఖంగుతిన్నా సూర్యుడు. ‘ స్వామీ నేనే సూర్యుడిని.’ నేను కేవలం నా ధర్మాన్ని మాత్రమే నిర్వర్తిస్తున్నాను. నన్ను శిక్షించడం తమ వంటి మహర్షులకి తగదు. అని ప్రాధేయపడ్డాడు.
Promoted Content