చేతిని చూసి జాతకం చెప్పడం! | Palm Reading in Telugu

6
51929
how-to-read-palms
Palm Reading Astrology
Next బటన్ నొక్కకుండా మొత్తం కంటెంట్ సింగల్ పేజీ లో మరింత సులువుగా చదవటానికి మన హరి ఓం యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి Android / iOS

Palm Reading Astrology / Palmistry / Hasta Samudrikam

4. చేతి ఆకృతిని బట్టి తెలిసే విషయాలు

  1. కొన్ని చేతులలో వ్రేళ్ళు వంగి ఉంటాయి. వంకరగా ఉంటాయి. వీరిది ఆద్యాత్మిక హస్తము అంటారు. అందువల్ల వీరికి దేవుడు ఉన్నాడన్న నమ్మకం ఉంటుంది.  దైవచింతన ఉంటుంది. దైవకార్యక్రమములు, ధర్మకార్యక్రమములు  చేస్తుంటారు. వీరికి సంసార జీవితము ఆనందంగా ఉండదు. ఒంటరి జీవితమును అనుభవిస్తారు.
  2. కళా హస్తము:  వీరికి వ్రేళ్ళు చివరలో మొనదేలి ఉంటాయి. రాను, రాను నున్నగా, మొనదేలిన వ్రేళ్ళు ఉంటాయి.  ఇలా ఉన్న హస్తమును కళాహస్తము అంటారు. వీరికి కళలయందు ఇష్టము ఉంటుంది. వీరు కళలలో మంచి పేరు సంపాదించుకుంటారు. నటులు, కవులు, గాయకులు కాగలరు. ఇతరులను ఆకర్షించగల శక్తి వీరికి ఉంటుంది.
  3. మొనదేరిన హస్తము: వీరి చేతిలో వ్రేళ్ళు సన్నగా, పొడవుగా మొనదేలి  ఉంటాయి.  వ్రేళ్ళు చాలా కోమలంగా, అందంగా ఉంటాయి. వీరికి సున్నితమైన మనస్సు ఉంటుంది. దైవభక్తి ఉంటుంది. శాంతిని కోరుకుంటారు. ఏకాంతమును కోరుకుంటారు. వీరు ఎల్లప్పుడూ  ఊహాప్రపంచంలో మునిగి ఉంటారు. వీరికి సంసార సుఖమందు కోరిక ఎక్కువ. సుఖపడతారు.
  4. మోటు హస్తము: చిన్నచేతులు, చిన్నవ్రేళ్ళు, మోటుగా గట్టిగా అసహ్యంగా ఉంటాయి చేతులు. ఇలా ఉండటం మంచిది కాదు. వీరికి ఆలోచన తక్కువ.  తెలివితేటలు, లొకికజ్జానము ఉండదు. నిలకడలేని ఆలోచన, నిలకడలేని వృత్తి, ఆదాయంలేక బాధలు పడుతుంటారు. ప్రతి రోజు ఒక నరకంగా గడుస్తూ ఉంటుంది వారికి. వీరికి వివాహ జీవితం కూడా బాగుండదు. సుఖపడలేరు.
Promoted Content

6 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here