
Lakshmi Devi
2. లక్ష్మీ దేవిని చంచల అని ఎందువలన అంటారు?
నారాయణునిపై అనురాగం పెల్లుబిక్కడం చేత లక్ష్మీదేవి తన భక్తుల వద్ద కూడా ఎక్కువ సేపు నిలబడదు. అందువలనే ఆమెకు చంచల అనే పేరు వచ్చింది. ఆమె అనురాగమే ఆమెకు ఆ అపకీర్తిని తెచ్చి పెట్టింది. ఇక్కడ మనం గమనించవలసినది ఏమిటంటే లక్ష్మీదేవి అనుగ్రహం కోసం సదా నారాయణుని మనసులో నిలుపుకోవాలి. ఎప్పుడైతే నారాయణుడు మన మనస్సులో నివాసం ఉండడో…అప్పుడు లక్ష్మీదేవి కూడా మనలను విడిచిపెట్టి వెడుతుంది. కాబట్టి ఆ భగవంతుని సదా మనసులోనే నిలుపుకోవాలి.
లక్ష్మీదేవికి చంచల, చపల అనే పేర్లున్నాయి. ఒకచోట స్థిరంగా ఉండదని దీని భావం. ఎందరి జీవితానుభావాల్లో దీనికి నిదర్శనం. అయితే నిజానికి అమ్మవారి లక్షణం చాంచల్యం కాదు. మన కర్మాచరణకీ, బుద్ధికీ స్థిరత్వం లేకపోవడం చేత కర్మఫలప్రదాయిని జగదంబ అస్థిర ఫలాలను ప్రసాదిస్తోంది. అమ్మవారి సహజగుణం అనవతర నారాయణాశ్రయం. అంటే క్షణకాలం నారాయణుని విడవజాలనితనం. నారాయణుని అవతారాలన్నిటిలోనూ ఆమె ఏదో ఒక విధంగా ఆయనను ఆశ్రయించుకునే ఉంటోంది.
నారాయణుడు అంటే ఎవరు.మనకు చాలా మంది దేవుళ్ళు ఉన్నారు కదా.
మనకున్న దేవుళ్లలో నారాయణుడు ఎవరు
Weight loss elaavali