
Lord Rama About Brotherhood
2రక్త సంబంధానికి పూర్తి విలువ.
లక్ష్మణుడుతో పోరాడుతున్నప్పుడు ఇంద్రజిత్తు విసరిన అస్త్రంతో గాయపడి మూర్ఛపోతాడు. రక్తపు మడుగులో ఉన్న తమ్ముడిని చూసిన రాముడికి ఎంతో దుఃఖం కలుగుతుంది. “నా ప్రాణానికి ప్రాణమైన లక్ష్మణుని ఈ పరిస్థితిలో చూడగానే నాకు నా శక్తి క్షీణించిపోతోంది. ఒకవేళ లక్ష్మణుడు మరణిస్తే, నా జీవితానికి, సంతోషానికి అర్థమేముంది?” అని రాముడు విలవిల్లాడుతాడు.
“లక్ష్మణా! విజయం కూడా నన్ను తృప్తి పరచలేదు. దృష్టి కోల్పోయిన వ్యక్తికి చంద్రుడు ఏ విధంగా సంతోషాన్ని ఇవ్వగలడు. ఇప్పుడు నేను పోరాడి సాధించేది ఏంటి? లక్ష్మణుడు మరణించి ఉంటే, నేను ఈ యుద్ధం చేసి లాభం ఏమిటి?” ” అని రాముడు తన బాధను వ్యక్తం చేస్తాడు.
“భార్యలు ఏ దేశంలోనైన దొరుకుతారు, బంధువులు కూడా అంతే. కానీ ఏ దేశానికి వెళ్ళిన తోబుట్టువులు మాత్రం దొరకరు. వారిని కోల్పోకూడదు” అని రాముడు తోబుట్టువుల విలువను వివరిస్తాడు.
“నేను ఇక్కడే, ఈ యుద్ధభూమిలోనే మరణిస్తాను, తిరిగి అయోధ్యకు వెళ్ళను, నాకు నీ కంటే ఎవరు ఎక్కువ కాదు” అని రాముడు లక్ష్మణుడి పట్ల తన ప్రేమను చాటి చెబుతాడు.
రామాయణంలో ఈ దృశ్యం తోబుట్టువుల బంధం ఎంత గొప్పదో మనకు చాటిచెబుతుంది. అహంకారాలు, కోపాలు మనల్ని దూరం చేస్తాయి. కానీ ప్రేమ, అప్యాయత మన బంధాలను బలంగా ఉంచుతాయి. రామ, లక్ష్మణ, భరత, శతృఘ్నులులాగా మనం కూడా అప్యాయతతో జీవించాలి.
మరిన్ని వివరాల కోసం పక్క పేజీలోకి వెళ్ళండి.