కన్య

ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1,2,3,4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు

డైలీ రాశిఫలాలుకై మన హరి ఓం యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి.
డౌన్లోడ్ చేసుకోవడానికి : ఆండ్రాయిడ్ – ఐ ఓస్

28 Feb, 2021 to 06 Mar, 2021

ఎవరి వలన అయినతే సహాయం లభించిందో వారి నుండే సమస్యలు ఎదురగుట వలన కొంత అయోమయంగా ఉండగలదు. శారీరక శ్రమలు పెరుగుట మరియు స్థిరాస్థి మూలక సమస్యలు ఉత్పన్నం కాగలవు. జీవితభాగస్వామి యొక్క సహాయ సహకారములు లభించినప్పటికి అసంతృప్తిగానే వుండగలదు. వాహనముల పై ప్రయాణించినపుడు తగు జాగ్రత్త వహించుట మంచిది. వాదోపవాదాలకు, తగవులకు దూరంగా ఉండుట మేలు. హాని కలుగు అవకాశములు కలవు.

కన్యారాశి వారి ఈ గ్రహస్థితిని పరిశీలించగా సంవత్సరమంతయూ శుభాశుభ మిశ్రమ ఫలితములు గోచరమగుచున్నవి. సంవత్సర ప్రారంభమున విశేష లాభము ధనవృద్ధి, సర్వకార్యసిద్ధి, అప్రయత్న ధనలాభము, అప్రయత్న కార్యసిద్ధి కలుగును, మనోవాంఛలు నెరవేరి సంతోషము కలుగును, అన్ని కార్యములయందు పురోగతి లభించును, నూతన వర్ణాభరణ ప్రాప్తి, కార్యానుకూలత వాహన, వస్తు, రత్నాభరణ సంగ్రహము, నూతన దేవాలయ నిర్మాణ ఫలప్రాప్తి, గోపూజ, పశులాభము, కీర్తి ప్రతిష్టలు కలుగును, నూతన రాజకీయ పదవీ యోగము కలుగును, పూర్వార్జిత ధనవృద్ధి కలుగును. –

సంవత్సర మధ్యకాలమందు అకారణ కలహములు, మనోవ్యధ, దుర్వ్యయము, ఇంటియందు వివాహది శుభకార్యములు నిలిచి పోవుట, భూ, గృహనిర్మాణది కార్యములు వాయిదా పడుట, మనో దుఃఖము కలుగును, పదవీ వియోగము కలుగును, ఉద్యోగ నష్టము, సస్పెన్షన్లు ఎదుర్కోనవలసి వచ్చును, శతృ పీడ కలుగును, పోలీసు, కోర్టు కేసులు ఎదుర్కొనక | తప్పదు. వస్తు, వాహన వ్యయము, దొంగల భయము కలుగును, విలువైన వస్తువులను పోగొట్టు కొందురు. అగ్ని భయము, విషకీటక భయము, జంతు భయము మనోవ్యధ కలుగును.

సంవత్సరాంతమున పరిస్థితులు చక్కబడును, సర్వకార్యజయము, ఆరోగ్యము కలుగును. పోగొట్టుకున్న వస్తువులు, ఉద్యోగము తిరిగి వచ్చును, బంధు లాభము, మిత్రలాభము కలుగును, అప్రయత్న కార్యసిద్ధి కలుగును, ధనలాభము కలుగును, నూతన వస్తు వాహన లాభము కలుగును, సంతాన ప్రాప్తి సంతాన సౌఖ్యము కలుగును, ఇంటియందు వివాహది | శుభకార్యములు కలుగును, నూతన గృహనిర్మాణ ప్రాప్తి, సౌఖ్యము కలుగును, విద్యాభివృద్ధి, | కార్యజయము కలుగును, దైవ, గురుభక్తి, రాజపూజ్యత కలుగును, ఇష్టకార్యసిద్ధి కలుగును, అధికార ప్రాప్తి, రాజసన్మానము, పితృ జనాభివృద్ధి తప్పక కలుగును.

విదారులకు రెండవ ఛాన్స్ లాభించును, ఉద్యోగులకు మిశ్రమ కాలము సస్పెన్షన్లు ఎదుర్కొనక తప్పదు, అధికారుల వలన ఇబ్బందులు అయిష్ట బదిలీలు కలుగును. నిరుద్యోగులకు సంవత్సరాంతమున అనుకూల ఫలితము కలుగును, రైతులకు సంవత్సర ప్రారంభమున నిరాశ తప్పదు, రెండవ పంట లాభించును, వ్యాపారులకు మిశ్రమకాలము స్పెక్యులేషన్ మిశ్రమము, బ్రహచారులకు సంవత్సర అంత్యకాలమందు వివాహము జరుగును. NRI లకు వ్యతిరేక ఫలితములతో తిరుగు ప్రయాణములుండును.