వృషభం

కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1,2,3,4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు

డైలీ రాశిఫలాలుకై మన హరి ఓం యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి.
డౌన్లోడ్ చేసుకోవడానికి : ఆండ్రాయిడ్ – ఐ ఓస్

28 Feb, 2021 to 06 Mar, 2021

వారం ప్రారంభం నుండే ప్రతిదీ సమస్యాత్మకంగా ఉన్నపటికిన్నీ పట్టుదలతో యుక్తితో స్నేహితుల సహయంతో అనుకున్నది అనుకున్నట్లుగా చేయుదురు. తండ్రికి ఖర్చులు పెరుగగలవు. ఆర్ధికపరమైన లావాదేవీలు యందు అనుకూలంగా ఉండగలదు. వృత్తి, వ్యాపారాదులలో శ్రమలు, యిబ్బందులను ఎదుర్కొనవలసి రాగలదు. వైవాహిక సమస్యలు, ఆరోగ్యలోపములు పెరుగగలవు. వాహనములపై వెళ్ళు చున్నప్పుడు తగు జాగ్రత్తలు తీసుకొనుట మంచిది.

వృషభరాశి వారి ఈ గ్రహస్థితులు పరిశీలించగా సంవత్సరమంతయూ శుభాశుభ మిశ్రమఫలితములుండును. సంవత్సర ప్రారంభమునందు పూర్తిగా అనుకూల ఫలితములతో ఉత్సహముగా నుందురు, తలచిన కార్యములన్నియూ, సత్వరమునెరవేరగలవు, భూ, గృహనిర్మాణాది కార్యములు వేగిరముగా ముందుకు సాగును. సంవత్సర మద్యకాలమందు అనారోగ్య పీడ కలుగును, తరచు వైద్యశాలా దర్శానము, ఔషద సేవనము కలుగుచుండును, మనోవ్యాకులత పెరుగును, ఆదాయ వనరులు క్షీణించును, సంవత్సరాంతమున తిరిగి ఆరోగ్యముచేకురును, భాధలన్ని తొలగి సంతోషము కలుగును. –

సంవత్సర ప్రారంభమున సర్వకార్యసమృద్ధి మనోనిబ్బరము, ధనధాన్యాభివృద్ధి, మిత్రలాభము. ఇంటి యందు వివాహది శూభకార్యములు సిద్ధించును, సర్వజన పూజ్యత కలిగి నూతన పదవీయోగముండును. పుత్ర, పౌత్రవృద్ధి కలిగి ఆనందముగా నుందురు, అభివృద్ధిలోనికి వత్తురు, మనోనిశ్చయము పెరుగును, నూతన పదవీయోగము కలుగును.

సంవత్సర మద్యకాలము నందు సర్వకార్యవిలంబము, అనారోగ్యము కలుగును, ఔషధ సేవనము, అగమ్యాగమ్యము కలుగును, మనోదుఃఖమ కలుగును, ఆర్థిక నష్టములు కలుగును, దొంగల భయము, రాజభయము కలుగును, మనోనిశ్చయము తగ్గును, శతృభయము కలుగును, అపనిందల నెదొర్కొందురు, ఆలస్య భోజనము, అకారణ కలహము కలుగును. వివాహది శుభకార్యములు నిలిచిపోవును. కార్యములన్నియు విఘ్నములు కలుగును. సర్వులతో కలహవాతావరణము కలుగును. –

సంవత్సరాంతమునందు తిరిగి పూర్వవైభవము నొందుదురు ఆరోగ్యము సిద్ధించును, మనోనిబ్బరము పెరుగును, శతృవులు మిత్రులగుదురు, నూతన వస్తు, వాహన లాభము కలుగును, నూతన స్వర్ణ, రజిత ఆభరణ లాభము కలుగును, రాజ పూజ్యత కలుగును.

విద్యార్థులకు రెండవ చాన్స్ అనుకూలము, ఉద్యోగులకు ఉత్తరార్ధముబాగుండును. పూర్వార్ధము ఒత్తిడికి గురి అగుదురు. రైతులకు రెండవ పంట లాభించును, వ్యాపారులకు ఉత్తరార్ధమున అనుకూల ఫలితము లుండును. స్పెక్యులేషన్ లాభించదు, నిరుద్యోగులకు ద్వితియారం అనుకూలం, బ్రహ్మచారులకు ఉత్తరారమున వివాహములు జరుగును. NRI లకు మిశ్రమ ఫలము కలుగును.