తుల

చిత్త 3, 4 పాదాలు, స్వాతి, 1,2,3,4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు

డైలీ రాశిఫలాలుకై మన హరి ఓం యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి.
డౌన్లోడ్ చేసుకోవడానికి : ఆండ్రాయిడ్ – ఐ ఓస్

28 Feb, 2021 to 06 Mar, 2021

తమ యొక్క మాటతీరు వలన కావాల్సిన వారు కూడా మీకు దూరంగా ఉండెదరు. సుఖసౌఖ్యములు కొరవడగలదు. ఇప్పటి వరకు వున్న ఆర్ధిక మరియు కుటుంబ పరమైన సమస్యలు తగ్గినప్పటికిన్నీ ఆదాయం చేతికందుటలో ఆలస్యములు అగుట వలన అవసరములకు తగిన సొమ్మును ఇతరుల నుండి తీసుకోనవల్సిరాగలదు. వృత్తి, వ్యాపారాదులలో సరియైన నిర్ణయం తీసుకొలేకపోవుట వలన కొంత అశాంతికరంగా ఉండగలదు.

తులరాశి వారి ఈ గ్రహస్థితిని పరిశీలించగా సంవత్సరమంతయూ శుభాశుభ మిశ్రమ ఫలితములు కలుగును. సంవత్సర ప్రారంభమున అధిక ధన వ్యయము, మితిమీరిన ఖర్చులు, దుర్వ్యయము కలుగును, దొంగల భయము, అగ్ని భయము, రాజభయము కలుగును, అనవసర ఖర్చులు మీద పడును, అపనిందలు చోటు చేసుకొనును, ఇంటి యందు శూభకార్యములన్నియు నిలిచిపోవును. అనారోగ్యము కలుగును, తరచు వైద్యశాలదర్శనము, ఔషద సేవనము కలుగుచుండును. నిరాశ, నిస్పృహలకు లోనగుదురు, సంబంధము లేని | విషయముల యందు ధనము ఖర్చు అగును, ప్రయాణములయందు అప్రమత్తత అవసరము.

సంవత్సర మద్యకాలమునందు సకల కార్యజయము, సర్వకార్యసిద్ధి కలుగును, అనుకూల వాతవరణము కలుగును. బంధు పూజ్యత కలుగును, భూ, గృహనిర్మాణాది కార్యములు సఫలమగును, ఇంటి యందు వివాహది శుభకార్య సిద్ధి, కీర్తి ప్రతిష్టలు పెరుగును, అప్రయత్న ధన, ధాన్యములు కలుగును. నూతన వస్త్రా భరణ ప్రాప్తి, కార్యసిద్ధి, బంధు మిత్ర లాభము, ఇంటియందు, సంఘమునందు గౌరవము కలుగును, కొత్త ప్రాజెక్టులు రూప కల్పన చేయుదురు, నూతన ఉద్యోగలాభము, దైర్యము సౌఖ్యము కలుగును, సోదర, సోదరీ సౌఖ్యము కలుగును, మనో ధైర్యము కలిగి సుఖసంతోషములతో నుందురు.

సంవత్సరాంతమున అపనిందలు చోటు చేసుకొనును. ఇంటియందు శూభకార్యములు నిలిచి పోగలవు, అనవసర ధనవ్యయము కలుగును, ఇన్‌కంటాక్స్ వంటి సంస్థల నుండి నోటిసులు వచ్చును, ఆర్థిక సమస్యలు జటిలమగును, మనో వ్యధ కలుగును, ఆరోగ్యము క్షీణించును, మనో ధైర్యము సడులును. చోర భయము, అగ్ని భయము కలుగును. విలువైన వస్తు, వాహన, అభరణములు పోగొట్టుకుందురు, దూర దేశ ప్రయాణములు కలిగి అచ్చట నిష్ప్రయోజనము కలుగును. శారీరక, మానసిక పీడ కలుగును.

విద్యార్థులకు మొదటి ఛాన్స్ లాభము, ఉద్యోగులకు పీడ కలుగును, అధికారుల వలన ఇబ్బందల నెదుర్కొనక తప్పదు, అయిష్ట బదిలీలు నెదుర్కొందురు. నిరుద్యోగులకు సంవత్సర మధ్యమున అనుకూల ఫలితము కలుగును, బ్రహ్మచారులకు నిరాశ తప్పదు, రైతులకు మొదటి పంట లాభము, వ్యాపారులకు మిశ్రమకాలము స్పెక్యులేషన్ లాభించదు, | NRI లకు అనుకూల కాలము కాదు. వ్యతిరేక ఫలితములు ఎదుర్కొందురు.