సింహం

మఖ 1,2,3,4 పాదాలు పుబ్బ 2,3,4 పాదాలు, ఉత్తర 1వ పాదం

డైలీ రాశిఫలాలుకై మన హరి ఓం యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి.
డౌన్లోడ్ చేసుకోవడానికి : ఆండ్రాయిడ్ – ఐ ఓస్

17 Jan, 2021 to 23 Jan, 2021

మీకు ఉన్న రచన రంగ పరిచయం వలన మీరూ కొత్త దారులు చూస్తారు.,20 వ తేదీన మీకు ఎప్పుడో నిలిచిపోయిన డబ్బు చేతికి అందుతుంది.త్వరలో పూర్తి అవుతాడన్న పని 21,22 తేదీల్లో ఆగిపోతుంది. మీరి పరుల కస్టాలను, సమస్య ల్స్ను 23 న వింటారు.

సింహరాశి వారి ఈ గ్రహస్థితిని పరిశీలించగా సంవత్సరమంతయూ శుభాశుభ మిశ్రమ ఫలితములు కలుగును. సంవత్సర ప్రారంభమున అధిక ధనవ్యయము, ఋణ పీడ, దుర్డ్యుయము, మనోవ్యధ, ఆర్థిక చిక్కులు, బ్యాంకులు, ఇతర ఆర్థిక లావాదేవిల యందు హఠాత్తుగా సమస్యలు ఉత్పన్నమగుట, వస్తు, వాహన వ్యయము, మనో వ్యధ, అనవసర చిక్కులు, శతృ పీడ, నూతన వస్తు వ్యయము, సర్వ కార్యములయందు నిలబాటు కలుగును. అనుకున్న పనులన్ని ఆగి పోవును. పనుల యందు పురోగతి లేక మనోవ్యధ కలుగును, వైద్యశాల దర్శనము, ఔషధ సేవము తరచు కలుగుచుండును.

సంవత్సర మధ్య కాలమందు అప్రయత్న కార్యసిద్ధి, అప్రయత్న ధనలాభము, సర్వ కార్యజయము, మనోవాంఛాదుల ప్రాప్తి, ఇష్టసిద్ధి సర్వకార్యములయందు పురోగతి కలుగును. ఇంటి యందు శూభకార్యములు కలుగును. నూతన వస్తువాహన లాభము, రత్నాభరణాధి సంగ్రహము నూతన భూ గృహనిర్మాణాది ప్రాప్తి, నదీతటాక సేతు స్నానఫలప్రాప్తి, నూతన దేవాలయనిర్మాణ ఫలము, అన్నదాన విభవము, మిత్రలాభము, బంధు పోషణ కలిగి కీర్తిప్రతిష్టలు కలుగును. పశులాభము, గో లాభము, మృష్టాన్నభోజనప్రాప్తి కలుగును. నూతన పదవీయోగం సిద్ధించును.

జ్ఞానవార్తా ప్రసంగము, శయ్యాసౌఖ్యము, భార్యాపుత్రాది సౌఖ్యము, సంతానప్రాప్తి కలిగి ఇంటి యందు మనస్సంతోషము కలుగును. –

సంవత్సరాంతమున స్వల్ప అనారోగ్యము ఆర్థిక నష్టముల నెదుర్కొనుట, దూర ప్రయాణములు వాయిదా పడుట, సంతానసమస్యలు కలుగును వైద్యశాల సందర్శనము, ఔషద సేవనము తప్పదు నూతన కార్యములు వాయిదా పడును, ఆర్థిక సమస్యలు కలుగును. ఋణవృద్ధి కలుగును, ఆర్థిక భారము పెరుగును, దుర్వ్యయము, దుర్వ్యసనములు కలుగును, మర్యాదహని, మనో దుఃఖము కలుగును. –

విద్యార్థులకు మొదటి ఛాన్స్ లాభించును. ఉద్యోగులకు సంవత్సర మధ్యకాలము అనుకూలము, అనుకూల బదిలీలు జరుగును, నిరుద్యోగులకు నూతన ఉద్యోగప్రాప్తి కలుగును, రైతులకు మొదటి పంట లాభించును, వ్యాపారులకు సంవత్సర మధ్యకాలము లాభము కలుగును, స్పెక్యులేషన్ మిశ్రమము, బ్రహ్మచారులకు సంవత్సర మధ్యకాలమున శుభ ఫలితము కలుగును. NRI లకు మిశ్రమ ఫలితములు కలుగును.