మిధునం

మృగశిర 3,4 పాదాలు, ఆర్ధ్ర 1,2,3,4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు

డైలీ రాశిఫలాలుకై మన హరి ఓం యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి.
డౌన్లోడ్ చేసుకోవడానికి : ఆండ్రాయిడ్ – ఐ ఓస్

28 Feb, 2021 to 06 Mar, 2021

ఆర్ధిక యిబ్బందులు పెరుగగలవు. ఏ వ్యవహారం చేపట్టిన ముందుకు సాగుట కష్టతరం కాగలదు. వృత్తి, వ్యాపారాదులలో అభివృద్ధికై పాటుపడేదరు. జీవితభాగస్వామికి కోపావేశములు పెరుగగలవు. అతిముఖ్యమైన వ్యవహారంలో లొసుగులు ఎదురుగుట వలన కొంత ధనం ఖర్చు చేయవల్సి రాగలదు. అయినప్పటికీ సమయానికి స్పందిచుట వలన కొంత వరకు అనుకూలంగా ఉండగలదు. ఇతరుల మాట నమ్మరాదు. పక్కదారి పట్టించే అవకాశములు కలవు.

మిధునరాశి వారిపై ఈ గ్రహస్థితిని పరిశీలించగా సంవత్సరమంతయూ శుభాశుభ మిశ్రమ ఫలితములు కలుగును. సంవత్సర ప్రారంభమున సకల కార్యవిలంబము, మనోవ్యధ, క్షుద్బాద, అకాల భోజనము, అనారోగ్యము, తరచు వైద్యశాలా దర్శనము, ఔషద సేవనము కలుగుచుండును. సంవత్సర మద్య కాలమందు అన్ని కార్యములయందు పురోగతి,

మనోధైర్యము, మానసిక ఆనందము కలుగును, ఇంటియందు వివాహది శుభకార్యములు జరుగును, సంఘ గౌరవము, కీర్తి ప్రతిష్టలు పెరుగును, సంవత్సరాంతమున దైర్యము తగ్గి మనో వ్యాకులతకు గురి అగుదురు, ఆరోగ్యము కొరకు ధనవ్యయము చేయవలసి వచ్చును. సంవత్సర ప్రారంభమున తరచు వైద్యశాలా దర్శనము, కుక్షిబాధ, క్షేత్రనష్టము,

పిత్త | వికారము, మనోవైకల్యము కలుగును, ఆపరేషన్లు, ఔషద సేవనము కలుగును, వివాహాది శుభకార్యాములు ఆగిపోవును, తలచిన కార్యములన్నియు నిలచి పోవుటచే మనోవ్యాకులతకు గురి అగుదురు. చోరభయము, విషజంతు, కీటక బాధలు కలుగును.

సంవత్సర మధ్యకాలమందు సకల శుభములు కలుగును. ఆగిపోయిన పనులన్నియూ తిరిగి ప్రారంభము కాగలవు, వివాహది శుభకార్యములు పూర్తి అగును, మనో సంతోషము కలుగును, బందు మిత్రాదులు సహకరించెదరు శతృనాశము కలుగును, పోలీసు, కొర్టుకేసుల

యందు అనుకూలత కలుగును. అధికారలాభము, నూతన పదవీ యోగము సిద్ధించును. రాజపూజ్యత కలుగును, మృష్టాన్న భోజన ప్రాప్తి, శాంతి సౌఖ్యములు. భూ, గృహ నిర్మాణాది కార్యములన్నియూ సిద్దించును, మనోధైర్యము పెరుగును.మానసిక ఆనందము కలుగును.

సంవత్సరాంతమున తరచు ఆర్థిక నష్టములు కలుగును, సకల కార్యములు నిలిచి పోవును, భార్య పుత్ర కలహము శతృ పీడ పెరుగును, బందు పీడ, స్త్రీ వివాదము, ఉద్యోగ భంగము, పదవీ త్యాగము కలుగును, అకారణ కలహములు, వాహనప్రమాదములు కలుగును.

విద్యార్థులకు మొదటి ఛాన్సు అనుకూలము, ఉద్యోగులకు పుర్వార్ధము అనుకూల బదిలీలు జరుగును, ఉత్తరార్ధమున రాజభయము, సస్పెన్షన్లు కలుగును. రైతులకు రెండవ పంట చీడ పీడలకు గురి అగును, వ్యాపారులకు పూర్వార్ధము అనుకూలముగా ఉండును, | స్పెక్యులేషన్ లాభించదు. నిరుద్యోగులకు పూర్వార్ధము అనుకూలము బ్రహ్మచారులకు | పూర్వార్ధము వివాహములు జరుగును. NRI లకు మిశ్రమ కాలము ఉత్తరార్ధము కష్టకాలము.