మకరం

ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం1,2,3,4 పాదాలు, ధనిష్ట 1,2 పాదాలు

డైలీ రాశిఫలాలుకై మన హరి ఓం యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి.
డౌన్లోడ్ చేసుకోవడానికి : ఆండ్రాయిడ్ – ఐ ఓస్

28 Feb, 2021 to 06 Mar, 2021

తల్లి మరియు బంధువుల రీత్యా సమస్యలు ఎదురుగుట వలన మనశ్శాంతి కొరవడగలదు. యదార్ధము గుర్తించుట కష్టతరం కాగలదు. ముందాలోచన కొరవడగలదు. సహాయ సహకారములు లభించగలవు వాటితో బాటు నిందలు కూడా ఎదురుకాగలవు. దురుసుతనం పెరుగగలదు. ఆర్ధికపరమైన లావాదేవీల యందు అవసరములకు తగిన ధనం ఏదోవిధంగా అయిన (ఋణ రూపేణ ) అవసరములు తీరగలవు. అవగాహన లోపములు ఉండగలవు.

మకరరాశి వారి ఈ గ్రహస్థితిని పరిశీలించగా సం||రమంతయూ వ్యతిరేక ఫలితముల | నెదుర్కొనక తప్పదు. తరచు అనారోగ్యసమస్యలు చుట్టుముట్టును, మనోచింత పెరుగును,

ప్రతి పనియందు వ్యతిరేకత పెరుగును, శతృబాధ కలుగును, మిత్రులు కూడ శతృవుల వలె భాధించెదరు, బందు దూషణ, ఋణ పీడ, వ్యాది పీడలతో మనశ్శాంతి కరువగును. | ఆత్మవిశ్వాసం లోపించును, కఠిన సమస్యల నెదుర్కొనవలసి వచ్చును, సమయనికి తగిన ధనము లేక సతమత మగుదురు, ఆర్థిక నిర్ణయములు కఠినముగానుండ గలవు. –

బుద్దిభ్రంశము సర్వులతో కలహము పశునాశనము, ధనధాన్య నష్టములుండును, | క్షేత్రనాశనము, భూ, గృహ నిర్మాణాది కార్యములు నిలచి యుండుట, ఇంటి యందు | వివాహది శుభకార్యములు హఠాత్తుగా వాయిదా పడుట, భార్యా పుత్ర కలహము, వారి ఆరోగ్యము విషమించుట కలుగును, శస్త్ర పీడ, ప్రణపీడ కలుగును, రాజ భయము, బంధన

ప్రాప్తి, వాహన నాశనము కలుగును, శిరో రోగము, తాప జ్వరాధి భయము, దాయాది కలహము కలుగును, నీచ స్త్రీ కలహము, కుక్షిబాధ కలుగును. వృధా సంచారము, భార్య పుత్ర వియోగము కలుగును, అధిక వడ్డీలకు ఋణము చేయవలసివచ్చును. ఋణ పీడ అధికమగును శారీర పటుత్వము తగ్గును, ప్రతి పని యందు వాయిదా పడుట జరుగును.

సంవత్సరాంతమున కొంత ఊరట కలుగును, ప్రయత్నించిన కార్యములు ఆలస్యము | మీద నెరవేరును, చేయు వృత్తి వ్యాపారాదులయందు అనుకూలత కలుగును, బంధు మిత్రులు సహకరించెదరు. సంఘ గౌరవము పెరుగును, రత్నాభరణ సంప్రాప్తి, సంతాన వృద్ధి, సంతాన లాభము కలుగును, మనోదైర్యము పెరుగును, పుణ్యక్షేత్ర సందర్శనము, దైవభక్తి పెరుగును, తీర్థయాత్ర లాభము. ధనవృద్ధి, క్షేత్రలాభము, వ్యవసాయ లాభము కలుగును.

విద్యార్థులకు రెండవ ఛాన్స్ లాభించును, ఉద్యోగులకు కష్ట కాలము, అధికారులవలన మాటపడక తప్పదు, దూరప్రాంత అయిష్టబదిలీలు జరుగును, నిరుద్యోగులకు సంవత్స రాంతమున కొంత ఊరట కలుగును, బ్రహ్మచారులకు ఉపశమనం కలుగును, రైతులకు పంట నష్టములుండును, చీడ పీడ భాదలు కలుగును, వ్యాపారులకు నిరాశాజనకంగా ఉండును, కొన్ని వ్యాపారములు మూత పడును. స్పెక్యులేషన్ అనుకూలము కాదు, NRI | లకు కష్ట కాలము. స్వదేశీ బాట పట్టక తప్పదు.