మేషం

అశ్విని, భరణి 1,2,3,4 పాదాలు కృత్తిక 1వ పాదం

డైలీ రాశిఫలాలుకై మన హరి ఓం యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి.
డౌన్లోడ్ చేసుకోవడానికి : ఆండ్రాయిడ్ – ఐ ఓస్

28 Feb, 2021 to 06 Mar, 2021

ఇప్పటివరకు వున్నా ఆరోగ్యలోపములు, శ్రమలు, సమస్యలు తగ్గి సమయం అనుకూలంగా వునప్పటికిన్నీ వృత్తి, వ్యాపారాదులలో అనుకోని సమస్యలు ఉత్పన్నమగుట వలన చేతి వరకు వచ్చినది చేజారిపోయే అవకాశములు కలవు. పని వాళ్ళ నుండి సమస్యలు పెరుగుట, అయినవారి నుండి నిందలు పడుట జరుగగలదు. ఒక పక్క ఖర్చుల తాకిడి అధికం అగుటతో బాటుగా బద్ధకం పెరుగుట వలన అవకాశములను చేతులారా జారవిడుచుకొందురు.

మేషరాశివారి ఈ గ్రహస్థితిని పరిశీలించగా సంవత్సరమంతయూ శుభాశభ మిశ్రమంగా ఉండును. సంవత్సర పుర్వార్ధము పూర్తిగా అనుకున్న పనులన్నియు నెరవేరి సంతోషముగా నుందురు. ఇంటి యందు పుత్రసంతాన సౌఖ్యముకలుగును. నూతన ప్రయాణములు కలిగి విజయము పొందగలరు, విదేశీ ప్రయాణములు నెరవేరును. నూతన గృహ నిర్మాణాది కార్యములు నెరవేరును. నూతన వ్యక్తుల పరిచయము కలుగును, మానసిక ప్రశాంతత లభించును, రాజకీయ పదవీ యోగము కలుగును.

సంవత్సర మద్యకాలమందు అత్యంత నిరాశ కలుగును, సర్వకార్యభంగము జరుగును, పనులన్నియూ ఆగిపోవును, దూరప్రాంతములో నివసించు వారు తిరిగి వచ్చెదరు, ధనవ్యయము కలుగును, అనారోగ్యము కలుగును. తరచు వైద్యశాలా దర్శనము కలుగును, ఔషద సేవనము తప్పనిసరి. శత్రుపీడ, ఋణపీడ కలుగును. ఆర్ధిక మోసములకు గురికాబడుదురు. గృహ నిర్మాణాది కార్యములన్నియు ఆగిపోవును, వస్తు వాహనములు నష్టపోవుదురు, సకల కార్యావిఘ్నములు కలుగును. మిత్రులు శత్రువులవలె మెలగుదురు, నిరాశకు గురి ఆగుదురు. వ్యవసాయ, పశు నష్టములు, ఉద్యోగ భంగము కలుగును.

సంవత్సర ఉత్తరార్ధమున కొత్త ఉత్సాహము కలుగును. ఆగిపోయిన పనులన్నియు. తిరిగి ప్రారంభమగును, సమస్యలు తొలగును, ఇంటి యందు వివాహది శుభకార్యములు నెరవేరును ధనలాభము కలుగును, ఆరోగ్యము కీర్తిప్రతిష్టలు పెరుగును, దైవభక్తి పెరుగును, పుణ్యక్షేత్ర సందర్శనము చేయుదురు. నూతన విద్య, ఉద్యోగప్రయత్నములు ఫలించును, ధనాదాయము పెరుగును. నూతన వస్తు, వస్త్రలాభము కలుగును, సంఘ గౌరవము కలుగును, కీర్తి ప్రతిష్టలు పెరుగును, ఋణద్రవ్య సంగ్రహము కలుగును, పోలీసు, కోర్టు కేసులయందు పురోగతి లభించును, అనుకూల వాతావరణము కలుగును.గృహలాభము భోజనసౌఖ్యము, స్త్రీసమాగమము, బంధులాభము కలుగును.

విద్యార్థులకు మొదటి చాలాభించును, ద్వితియార్ధమునందు వ్యతిరేకత తప్పదు, ఉద్యోగులకు ఉత్తరార్ధమున కష్టకాలముగానుండును, దూరప్రాంత బదిలిలు జరుగును, రైతులకు ఉత్తరార్ధమున నిరాశ కలుగును, వ్యాపారులు నష్టములు ఎదుర్కొనక తప్పదు. స్పెక్యులేషన్ ప్రధమార్ధంలో లాభించును, నిరుద్యోగులకు పుర్వార్ధము అనుకూలము, | బ్రహ్మచారులకు పుర్వార్ధము వివాహములు కాగలవు, NRI లకు వ్యతిరేక ఫలము కలుగును.