కుంభం

ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం1,2,3,4 పాదాలు, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు

డైలీ రాశిఫలాలుకై మన హరి ఓం యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి.
డౌన్లోడ్ చేసుకోవడానికి : ఆండ్రాయిడ్ – ఐ ఓస్

28 Feb, 2021 to 06 Mar, 2021

తొడ, తల భాగమునకు సంబంధించిన ఆరోగ్యలోపములు ఇబ్బందులకు గురిచేయును. ఆవేశాపురితంగా వ్యవహరించినప్పటికిన్నీ లాభదాయకంగా ఉండగలదు పరిణాములు. కొంత సమయానుకూలంగా ఉన్నప్పటికిన్నీ సమయస్పూర్తిని మరచేదరు. ఒకానొక స్త్రీ కుటుంబం పై విమర్శలను విసిరేదరు. కాని అది కూడా మీ మంచికే జరుగును. గతంలో పడిన శ్రమలకు తగిన ఫలితములు ఇప్పుడు అందగలవు. సంతాన యొక్క ప్రవర్తన కొంచెం ఆశ్చర్యమును కలిగించును.

కుంభరాశి వారి ఈ గ్రహస్థితిని పరిశీలించగా సంవత్సరమంతయు శుభాశుభ మిశ్రమ ఫలితముగా ఉండును, ఏలినాటి శని ప్రభావము తప్పక కనపడును. సంవత్సర

ప్రారంభమున దుర్వ్యయము పెరుగును, అనవసర ఖర్చులు మీద పడును, అనారోగ్యము బాధించును తరచు వైద్యశాల దర్శనము, ఔషద సేవనము తప్పనిసరి, కుటుంబ సభ్యుల

మధ్య సఖ్యత లోపించును కలహవాతావరణముండును, మనో దుర్బలత్వము కలుగును, వస్తు, వాహన క్షయము కలుగును, బ్యాంకు లావాదేవిల యందు, ఆర్థిక లావాదేవిలయందు | సాంకేతిక సమస్యలు కలుగును, కార్యములన్నియు ఆగిపోవును, శతృపీడ కలుగును.

సంవత్సర మధ్యకాలమందు పునరుత్తేజము కలుగును, ఆర్థిక సమస్యలు నివారణ అగును, నూతన బలము కలుగును, నూతన, వస్తు, వాహన లాభము కలుగును, వస్రాభరణములు కొనుగోలు చేయుదురు, భూ, గృహనిర్మాణది కార్యములు ప్రారంభమగును

ఇంటి యందు వివాహది శుభకార్యములు నెరవేరును, దైవభక్తి పెరుగును, గురుపూజ, | పుణ్యక్షేత్ర సందర్శనము కలుగును. మహాత్ముల సందర్శనము, రాజదర్శనము కలుగును, | నూతన వస్త్రాభరణ ప్రాప్తి, గో, పశులాభము వ్యవసాయ లాభము, క్షేత్ర లాభము కలుగును.

సంవత్సరాంతమున పరిస్థితులలో మార్పు కలుగును, ముఖ్యంగా ఏలినాటి శని | ప్రభావము ఎక్కువగుటచే వ్యతిరేక పవనము వీచును, అనారోగ్యము భాదించును, ధనక్షయము, వాహనక్షమము కలుగును బందు ద్వేషము, మిత్ర ద్మేషము, రాజకీయ వ్యతి | రేకత కలుగును శారీరక పుష్టి తగ్గును. ఆందోళనకు గురి అగుదును, అతినిద్ర, అతి ఆకలి, సర్వకార్యములు వాయిదా పడును, ఇంటియందు శుభకార్యములు హఠాత్తుగా వాయిదా పడును, రాజకీయ, చోరభయము కలుగును, విలువైన వస్తువులు పోగొట్టుకొందురు.

విద్యార్థులకు మొదటి ఛాన్స్ లాభించును. ఉద్యోగులు పై అధికారుల వలన ఇబ్బందులకు | గురి అగుదురు అనివార్య దూరప్రాంత బదీలిలు పొందుదురు నిరుద్యోగులకు ప్రధమార్థం అనుకూలం, ద్వితీయార్ధం ఆర్థిక సమస్యలకు గురిఅగు సూచనలున్నవి, బ్రహ్మచారులకు మిశ్రమ ఫలితములు కలుగును, ప్రధమార్గమున కుదిరిన వివాహము వెంటనే చేసుకొనుట మంచిది, రైతులకు మొదటి పంట కొంత ఉపశమనముగా నుండును.నూతన వ్యాపారములకు అనుకులము కాదు. స్పెక్యులేషన్ లాభించదు, NRI లకు పూర్తిగా వ్యతిరేక కాలము.