
Greatness Of Charity
చాలా మంది దోషాలను నివారించుకోడానికి, భగవంతుని కృపను పొందటం కోసం దాన ధర్మాలను చేస్తూ ఉంటారు. వారిని లోకం ధనవంతులుగా గుర్తిస్తుందే గానీ గొప్ప వాళ్ళుగా కాదు.
కానీ తమ కోసం దాచుకున్నది కూడా పరులు ఆపదలో ఉన్నప్పుడు ఇచ్చివేసే వాళ్ళు మహాత్ములు. భగవంతుడు ఎల్లప్పుడూ వారికి తోడుగా ఉంటాడు.
దానం చేయగలగడం ఎంతో గొప్ప లక్షణం. దాన గుణం ఉన్నచోట భగవంతుడు ప్రత్యక్షమవుతాడని నిరూపించే కథ తెలుసుకుందాం.
4. రంతి దేవుడు నేర్పే నీతి (The Ethics Taught by Ranti Devudu)
మన దగ్గర ఉన్నది ఏదైనా మనం ఎదుటివారికి ఉపయోగ పడుతుందని తెలిసినా దాచుకోవడానికి ప్రధానంగా రెండు కారణాలుంటాయి.
ఒకటి ఆ వస్తువుపైగల అమితమైన మోహం. రెండు ఆ వస్తువుని మనం తిరిగి సంపాదించుకోలేమన్న భయం. ధీమంతులు దేనిమీదా వ్యామోహాన్ని పెంచుకోరు.
ధైర్యవంతులు ఎటువంటి అసాధ్యాన్నయినా ఎన్ని సార్లయినా సాధించుకు వచ్చే సమర్థులు.
రంతిదేవుడు ఈ రెండు లక్షణాలనూ పుష్కలంగా కలిగి ఉన్నవాడు. కనుకే ఆకలి దప్పులతో ప్రాణాలు కడబట్టినా తన చేతిలోని మంచినీటిని కూడా దానం చేశాడు. పరోపకారమే పరమాత్ముని సేవ అని రంతిదేవుని కథ చెబుతుంది.